ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Chandravarnudu Ane Brahmanudu Vidyabhyasamukai Velladam || చంద్రవర్ణుడు అనే బ్రాహ్మణుడు విద్యాభ్యాసముకై వెళ్లడం || Batti Vikramarka Kathalu || భట్టి విక్రమార్క కథలు

 చంద్రవర్ణుడు అనే బ్రాహ్మణుడు విద్యాభ్యాసముకై వెళ్లడం

రాజోత్తమా! భోజరాజా! నేను చెప్పబోయే విక్రమార్క మహారాజు చరిత్ర అత్యద్భుతమైనది. అతనికి గల సాహస,ధైర్య, స్తైర్య,గాంభీర,పరాక్రమ, చాతుర్య, విద్యా వివేకంలో, ఔదార్య,దయ, సత్యం, పరులకు ఉపకారం చేయడం లాంటి శుభ గుణాలు ఈ ప్రపంచంలో మరి ఏ మనిషికి ఉండవు.అనంత సద్గుణ గుణాలు శోభితుడై నిరంకుశముగా రాజ్యాన్ని చాలా కాలం ధర్మ పాలన చేస్తున్నాడు. లోకంలో అతని కీర్తి చంద్రుడుతో సమానమై నిలుచున్నట్టు చేసి భూమి పై సకల జనులలో చిరస్మరణీయుడై ఉన్నాడు. రాజాధిరాజకు విక్రమార్కుని లక్షణాలు ఎంత వర్ణించినా తృప్తి కలగదు. అటువంటి ఆ పుణ్యాత్ములు చరిత్ర మొదటి నుండి నేను నీకు చెప్తాను సావధాన మనస్సు కలిగి విను అని ఇలా చెప్పింది.

అఖండ ప్రకృతి శోభా విరాజితమైన ఈ భూమిపైన సకల ఐశ్వర్యం, జన సమృద్ధి, పాడి పంటలతో ప్రసిద్ధి చెందిన నందిపురం అను పట్టణం ఒకటి కలదు. అందులో వేదాలలో ప్రవీణులైన బ్రాహ్మణోత్తములు, శత్రు జనాలకు భయంకరులై మహా పరాక్రమముచే పేరు గలిగిన క్షత్రియలు, ధన ధాన్య రత్నాలు అధికంగా కలిగి ఉండి సకల వస్తు సముదాయాలు క్రయవిక్రయాలు జరుపుతున్న ధనికులైన వైశ్యులు, సంపన్నులై దైవభక్తి కలిగి సత్ప్రవర్తన ఉన్న శూద్రులతో ఆ నగరం లోకులకు ఆనందకరంగా ఉంటున్నది. ఆ నగరంలో గల విప్రులలో చాలా మంచి రూపం గల చంద్రవర్ణుదు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చతుర్వేదములు, ఆరు రకాల శాస్త్రాలు, 18 పురాణాలు, కథలు తెలిసినవాడు. అయినా కానీ వాటితో తృప్తి పొందక ఇంకా విద్యను, విద్యా రహస్యాలను తెలుసుకోవాలి అని అనుకోని దానికోసం తగిన గురువులను వెతకడానికి ఒక శుభముహూర్తాన చూసుకొని ప్రయాణమై ఇల్లు విడిచి బయలుదేరాడు. ఆ బ్రాహ్మణుడు క్రమముగా నానా దేశాలు తిరిగి తిరిగి తన కోరిక తీర్చగల గురువు ఎందుకు కనిపించడం లేదు అని అనుకోని దానితో అతడు విసిగిపోయి నిరాశుడై మరల తన స్వగ్రామానికి వస్తున్నాడు.

ఆ సమయంలో చాలా దూరం నడవడం వల్ల, తగిన ఆహారం లేకపోవడం వల్ల, నీరు కూడా లేకపోవడం వలన, బాగా ఎండలు కాయడం వలన అలసిపోయి నడవలేక పోయాడు. నీరసంతో మహాకష్టముతో వస్తున్న ఒకచోట అతనికి దైవ అనుగ్రహం వలన నిర్మల జలం కలిగిన చెరువు ఒకటి కన్నా కనిపింది. దానిని చూడగానే చంద్రవర్ణుడికి పోయిన ప్రాణాలు వచ్చినట్టు అనిపించింది. దానితో అతను అత్యంత ఆత్రుతతో ఆ చెరువు దగ్గరికి వెళ్లి అందులో స్నానం చేసి, అతని నిత్య కృత్యాలు తీర్చుకొని, తృప్తిగా మధురంగా ఉన్న ఆ జలమును తాగాడు.

కొంత అలసట తీర్చుకోవాలని ఆ కొలను వడ్డుకు వచ్చి చుట్టుపక్కల చూశాడు. అప్పుడు అక్కడ దట్టమైన కొమ్మలు కలిగి చల్లటి నీడని ఇస్తున్న గొప్పదైన రావి చెట్టును చూసి సంతోషించాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి తన పై వస్త్రాన్ని పరిచి, ఆ చెట్టు వేళ్లపై తలపెట్టాడు. నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో పడుకొని చల్లని గాలి వీస్తూ ఉండగా హాయిగా గాఢ నిద్రపోయాడు.



                                                                                                                      ← PREV || NEXT →

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు