ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం
దశరథ మహారాజు పుత్రుల కొరకై గోదాన వ్రతాన్ని చేయించాడు. ఇంతలో కైకేయ మహారాజు కుమారుడు, భరతుని మేనమామ అయిన యూధాజిత్తు వచ్చాడు.
యూధాజిత్తు మహారాజు జనక మహారాజుతో ఇలా అన్నాడు: మహారాజా! మా తండ్రి గారు మీ క్షేమ సమాచారాన్ని విచారించి రమ్మని నన్ను పంపారు. అక్కడ మేము, మా పరివారం అంతా క్షేమమే. ముఖ్యంగా మనుమడైన భరతుని క్షేమం తెలుసుకొని రమ్మన్నారు. అందు కొరకు అయోధ్యకు వెళ్లాను . మీరంతా వివాహానికై ఇక్కడ ఉన్నారని తెలిసింది. వెంటనే బయలుదేరి వచ్చాను.
అంతట దశరథ మహారాజు తన ప్రియాతిప్రియమైన అతిథికి ఉచితరీతినగౌరవమర్యాదలు చేశాడు. రాత్రంతా కులాసా కబుర్లతో గడిపారు. ఉదయానే దశరథుడు తన పుత్రులందరినీ, వెంటబెట్టుకొని, వసిష్టాది మహర్షులు ముందు నడువగా యజ్ఞవాటికకు బయలుదేరాడు. జనక మహారాజు వచ్చి దశరథుని ప్రక్కనే కూర్చున్నాడు.
రాముడు, సోదరులంతా కలసి చక్కగా అలంకరించుకొని తండ్రి వద్దకు వచ్చారు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అన్నాడు : ఓ జనక మహారాజా! దశరథ మహారాజు తన పుత్రులతో వివాహానికై తరలివచ్చారు. కన్యాదాత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నీవు నీ ధర్మాన్ని నెరవేర్చాలి.
అప్పుడు జనక మహారాజు మందహాసం చేస్తూ మహర్షీ! దశరథ మహారాజుకు ఇక్కడ అడ్డు ఏమైనా ఉన్నదా? ద్వారపాలకులు ఆయన్ను అడ్డగిస్తున్నారా? నేనూ, నా రాజ్యం అంతా ఆయన సేవలో ఉన్నాం. కాబట్టి మేమే ఆయన ఆజ్ఞ్జలకై ఎదురుచూస్తూ ఉంటాం.
ఓ వసిష్ట మహర్షీ! ఇక తామే పూనుకొని వివాహ కర్మలన్నీ చేయించమని కోరుచున్నాను. అంతట వసిష్ట, విశ్వామిత్ర, శతానందులు అందరినీ వివాహ మంటపానికి తీసుకొని వెళ్లాను . అచట అప్పటికే గంధపుష్పములు, బంగారు పాలికలు, అంకురములు గల రంధ్రములతో కూడిన కలశాలు, అంకురములు కట్టిన మూకుళ్లు, ధూపాన్ని వెదజల్లే ధూప పాత్రలు, శంఖాకారంలో ఉండే పాత్రలు, ఇంకా అనేక రకాలైన పాత్రలు, అక్షితలు సిద్ధంగా ఉన్నాయి.
మహా తేజశ్శాలియైన వసిష్టుడు యథాశాస్తోక్తంగా, మంత్రపూర్వకంగా, సమములైన దర్భల్ని పరచి అగ్నిలో హోమం చేశాడు.
శ్రీ సీతారాముల కళ్యాణం
జనక మహారాజు సర్వాలంకార భూషిత రాలగు సీతను తీసుకొని వచ్చి రాముని ఎదుటగా నిలబెట్టాడు. ఓ రామా! ఈమె నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపు. నీ హస్తమును ఆమె హస్తముపై ఉంచి పట్టుకొనుము. మహా భాగ్యవంతురాలగు ఈమె పతివ్రతయై నీడ వలె ఎల్లవేళలా నిన్ను అనుసరిస్తుంది. ఈ మంత్రపూర్వకమైన జలాన్ని మీ ఉభయులపైనా అభిషేకించుచున్నాను.ఆ వివాహాన్ని ఆకాశాన్నుండే దేవతలంతా వీక్షించారు. ఆనందంతో నృత్యగీతాలు పాడారు. పుష్పవర్షం కురిపించారు.
తరువాత, ఓ లక్ష్మణా! నీకు క్షేమమగుగాక! ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరింపు. ఈమె చేతిని నీ చేతిలోకి తీసుకో.
పిమ్మట, ఓ భరతుడా! నీకు క్షేమమగుగాక. ఈమె నా కుమార్తె మాండవి. నీ హస్తంతో ఈమె హస్తమును స్వీకరించు.
పిమ్మట, ఓ శత్రుఘ్నుడా! ఈమె నా కుమార్తె శృతకీర్తి. నీ హస్తంతో ఈమె హస్తాన్ని స్వీకరింపు. ఈ క్షణం నుండి ఈమె నీ ధర్మపత్ని.
జనకుని మాటలు విన్న రామలక్ష్మణ భరతశతృఘ్నులు నలుగురూ, వసిష్ణుని అనుమతి పొంది వారి హస్తములను స్వీకరించారు. తరువాత వారందరూ భార్యాసమేతులై అగ్నికి, వేదికకు, దశరథ మహారాజుకు, జనక మహారాజుకు, వసిష్ట, విశ్వామిత్ర, శతానందాది బుషులకు మూడు పర్యాయాలు ప్రదక్షిణ చేశారు. యథాశాస్తోకంగా వివాహాలయ్యాయి.
రామలక్ష్మణ భరత శత్రఘ్నులు, సీతా, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల పాణిగ్రహణం చేయగానే దేవతలంతా _ఎడతెరిపి లేకుండా పుష్పవర్షాన్ని కురిపించారు. దేవగంధర్వ కిన్నెర కింపురుషాదులు దుందుభులు మోగించారు. గీతము లాలపించారు. నాట్యం చేశారు. ఆకాశమంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఒక అద్భుత దృశ్యమైంది.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నూతన వధువులను చేయి పుచ్చుకొని మెల్లగా నడిపించుకుంటూ విడిది గృహానికి బయలుదేరారు. దశరథ మహారాజు, జనక మహారాజు, కుశధ్వజుడు, వసిష్ట, విశ్వామిత్ర, శతానందాది బుషిపుంగవులంతా వారిని అనుసరించారు.
Comments