ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
నూతన వధూవరులకు జనకుని వీడుకోలు
రాత్రంతా ఒక్క క్షణంలా గడచిపోయింది. ఎవరూ కునుకు తీయలేదు. తెల్లవారింది. అనుష్టానాలన్నీ ముగిశాయి. విశ్వామిత్రుడు వధూవరులను ఆశీర్వదించి హిమాలయాలకు తపస్సు చేసుకోవటానికి వెళ్లిపోయాడు.
అంతట దశరథ మహారాజు కూడా జనకాదుల వద్ద సెలవు తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. జనక మహారాజు తన కుమార్తెలకు లక్షలకొద్దీ ఆవులను, శ్రేష్టమైన కంబళీలు, కోట్లకొద్దీ పట్టువస్త్రాలను, ఏనుగులు, అశ్వాలు, రథాలు, చతురంగ సైన్యాన్ని, శ్రేష్ఠులైన దాసీలను, వెండి, బంగారు ఆభరణాలను విలువైన రత్నాలను కానుకగా సమర్పించాడు.
జనకాది బంధువులంతా దశరథుని పరివారాన్ని చాలా దూరం అనుసరించి సాగనంపి తిరిగి ఇళ్లకు చేరారు.
దశరథుడు, రామలక్ష్మణ భరత శత్రఘ్నులతో కలసి ప్రయాణం చేస్తూ ఉండగా పక్షులు భయంతో వికృతమైన ధ్వనులు చేశాయి. జంతువులన్నీ ప్రదక్షిణలు చేస్తున్నాయి. దశరథుడు ఇవన్నీ దుశ్శకునాలని తలచి తన మనస్సు ఏదో కీడు శంకిస్తున్నదని వసిష్టునితో అన్నాడు.
అప్పుడు వసిష్ట మహర్షి మహారాజా! ఆకస్మికంగాను, దైవికంగాను, భయంకరమైన ఆపదలు ఏవైనా సంభవించేటప్పుడు పక్షులు ముందుగా పసిగట్టి భయంకరంగా అరుస్తాయి. అయితే భయపడవలసిన పనిలేదు. మృగాలన్నీ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఆ ప్రమాదాలేమీ మనల్ని బాధించేవి కావు.
వసిష్ట మహర్షి ఈ విధంగా దశరథ మహారాజుకు ధైర్యం చెప్తూ ఉండగానే భూమి కంపించింది. పెనుగాలులు వీచి వృక్షాలన్నీ వేళ్లతో సహా పెకలించివేయబడ్డాయి. మేఘాలు సూర్యుణ్ణి ఆవరించి నలుదిక్కులా చీకట్లు కమ్మాయి. సైనికులు మూర్శపొందారు. వసిష్టాది మహర్షులు, దశరథుడు, దశరథుని కుమారులు మాత్రం ఏమాత్రం కలత చెందకుండా నిబ్బరంగా నిలబడ్డారు.
హఠాత్తుగా మహా తపస్వి, భయంకరుడు, రాజుల పాలిట యముడు అయిన పరశురాముడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ తేజస్సును చూడలేక సామాన్యుల కళ్లు మూతలుపడ్డాయి. గండ్రగొడ్డలి భుజాన వేలాడుతోంది. ధనుర్భాణాలు ధరించి అపరశివునివలె కనిపించాడు. తన తండ్రిని కార్తవీర్యార్డునుడు అనే క్షత్రియుడు చంపటం వలన ఇతడు క్షత్రియులందరినీ శత్రువులుగా భావించాడు. భూమిపై క్షత్రియులను లేకుండా చేస్తానని దీక్ష పూనాడు. ఇప్పుడు కూడా క్షత్రియ నాశనమునకే వచ్చాడా? అని అనుకుంటూ మహర్షులంతా ఆతడికి అర్హ్యపాద్యాదులనిచ్చి “ఓ రామా! పరశురామా!” అంటూ మృదుమధురంగా స్తుతించారు. బుషీశ్వరుల పూజలను గ్రహించిన పరశురాముడు, రామునితో ఇట్లా అన్నాడు.
Comments