ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
శ్రీ కృష్ణదేవరాయల కొలువులో చేరిక
రాయలవారు ఆ భక్తుడిని మీరు మీరు ఎవరు అని అడిగినప్పుడు ఆ భక్తుడు “నేను ఆంధ్ర దేశమందు తెనాలి వాస్తవ్యుడను. నా తల్లి అక్క మాంబ, తండ్రి రాయనామాత్యులు. నాపేరు రామలింగకవి. కానీ, రామకృష్ణ కవిగా నాకువిద్య నేర్పే గురువుచే పిలవబడేవాడిని. ఇంటి పేరు గార్లపాటి వారు, కౌండిన్య గోత్రానికి చెందిన యజుశ్శాఖా నియోగి బ్రాహ్మణుడను, వివాహితుడను. ఇరువురు బిడ్డలకు తండ్రిని. ఉదరపోషణకై తమ వంటి వారి కొలువును ఆశించి మిక్కిలి ఆశతో తమ వద్దకు వస్తున్నాను. కాలము నాతో చేతులు కలుపునట్లు తమ ముందు నిలిపినది” అని చేతులు జోడించాడు రామలింగకవి.
“కవిశేఖరా! మీరు లీలాశుకుడు పై ప్రత్యేక గౌరవము కలిగినవారై ఉన్నారు. అమృత తుల్యమైన గానాన్ని వినిపించారు. అందులో కొన్ని మార్పులు బహుచక్కగా కుదిరినవి. దానికి మీ గాత్రం తోడైనది. ”
“ఓసార్వభౌమా! నేను పాండురంగ మహత్యం అను కావ్యం రాస్తున్నాను. అందులో ఈ శ్లోకం ఈ విధంగా సరి చేసి రాసాను. ఆ కావ్యం ఆ పాండురంగని దయతో పూర్తిచేయగలనని నమ్ముచున్నాను. భీమరధీ నదిలో స్నానం చేసినపుడు ఓ గొప్పఅనుభూతిని అనుభవించాను. ఈ పండరీ క్షేత్రం ఎంతో విశిష్టమైనది. నా కావ్య రచన ఇక్కడికి వచ్చాక నేను పూర్తిచేయ గలనని ఉత్సాహంతో ఉన్నాను." అని కళ్ళ నిండా తృప్తిని నింపుకుని చెప్పాడు. వారి సంభాషణ వింటున్న పూజారులు రెండు పాత్రలతో దేవునికి నైవేద్యంగా పెట్టబడిన క్షీరాన్ని రాయలవారి కనుసైగలతో తెచ్చి ఇచ్చారు. "కవీశ్వరా! ఈ రెండు పాత్రలలో ఉన్నది క్షీరమే(గోవుపాలు). ఒకటి మీరు
తీసుకువచ్చినది అంటే సాహిత్యలక్ష్మి పాత్ర. ఇక నేను తెచ్చినది ధైర్యలక్ష్మి పాత్ర ఈ రెండింటిని మనమిద్దరం తక్షణం పుచ్చుకొని ఒకింత సేద తీరాలి. ఇందులో ఏదో ఒకటి తీసుకొనుడు" అనిపాత్రలు చూపాడు రాయలు.
కొంచెం సమయం కూడా ఆలస్యం చేయకుండా రెండు పాత్రలను అందుకున్నాడు రామలింగకవి. వాటిని అటుఇటు చూసి ఒకింత సంధిగ్ధంలో పడ్డాడు. ఆలయ పూజారులు చేష్టలుడిగి చూసారు. అసలే రాయలు ఆ పాలను త్రాగి సేద తీరాలనుకుంటుంటే, ఈ వెర్రిబాపడు రెండు పాత్రలు పట్టుకుని ఆ వెర్రిమొర్రి చూపులతో కాలాయాపనచేస్తున్నాడేంటి? రాయల వారికి కోపం వస్తే పరిస్థితి ఏంటి?, ఇక తాము కలుగ చేసుకుని రానున్న ఉపధ్రవానికి అడ్డు కట్టవేయాలి అనుకుని “అయ్యా! రామలింగకవిగారూ! ఒక పాత్రను ఇప్పిం చండి. మన ప్రభువులు దప్పిక గొని ఉన్నారు" అని లోగొంతుతో కోరిరి.
అందుకు రామలింగడు నవ్వి "ఓ పుణ్యపురుషులారా! ప్రభువే నాకు రెండు మహోన్నతమైన క్షీర పాత్రలను ఇచ్చి వాటి గురించి వివరించారు. జంటలక్ష్మిలను ఏ భక్తుడును వదులుకోలేడు. నాకు అవశ్యం ఈ రెండు పాత్రలు ఇష్టమైనవే !" అని రెండుపాత్రలను ఎత్తి ఒకదాని తరువాత ఒకటి గడగడ తాగేసాడు. పూజారులు భయభ్రాంతులై చేష్టలుడిగి మరీ చూసారు. "మహాప్రభూ! నాజన్మధన్యం అయినది. నా జీవనాధారమైన సాహిత్యలక్ష్మిని పాలపాత్ర ద్వారా నేను తనివి తీరా తాగితిని. తమ వంటి వారి కొలువున మసలేందుకు అవసరమైన ధైర్యలక్ష్మిని మరోపాత్రలో పాలరూపంలో త్రాగాను. ఇందులే నా దోషం ఏమి లేదు ప్రభూ!" మిక్కిలి వినయముతో చేతులు జోడించి నిలబడ్డాడు.
"భళీ రామలింగా! నీ చమత్కారం, నా మనస్సును ఎంతగానో ఆనందపరిచినది" అని రామలింగకవిని గట్టిగ కౌగిలించుకున్నాడు రాయలు. పూజారులు గుండెలపై చేతులు వేసుకున్నారు. 'హమ్మయ్యా పెద్ద ఉప్పెన తప్పిందనుకున్నారు. మహాతేజస్సుతో వెలిగిపోతున్న రామలింగ కవిని తొలిసారిగా వింతగా అయోమయంగా చూసారు.
" కవితిలకమా! మీ గురించి లోగడ విని ఉన్నాను. మీరు కాళీ ఉపాసకులు అని, ఒకసారి అంబ ప్రతక్షమై రెండు పాయస పాత్రలు ఇచ్చి ఒకటి ధనము, వేరొకటి విద్యఇచ్చే పాత్రలు ఇందులో ఏదో ఒకదాన్ని మాత్రమే స్వీకరించు అని ఆ అమ్మ ఆదేశించగా మీరు బాల్యచాపల్యమున ఇక్కడ జరిగినట్లు రెండు పాత్రలలో పాయసం స్వీకరించినందున ఆ అమ్మఆగ్రహించి హాస్యకవికమ్ము అని పలికి అంతర్ధానమొందెనని విన్నాను. నేను ఆకథ నమ్ముచున్నాను. ఇప్పుడు నాకళ్లెదుట జరిగినది.”
"నేను లేలేతప్రాయమందు ఒకయోగి ఉపదేశించిన మంత్రో పదేశంపై ఓకాళికాళయంలో కనులు మూసి ఆ మంత్రం జపిస్తూ నిద్రపోయాను. నిద్రలో కూడా ఆ మంత్రం నా పెదవులపై అలా సాగిపోతుంటే ఆ అమ్మనా తదేక దీక్షకు మెచ్చి నా ఫాలభాగమందు కనిపించి మీరు విన్నట్టుగానే పాయసపాత్రలనిచ్చింది. ఏదో ఒక్కటి మాత్రమే తాగాల్సిందిగా అంబ ఆదేశాన్ని కాదని, రెండింటిని తాగినందుకు, అంబ నన్ను కోపంగా రెండు పాత్రలయందు పాలను ఎందుకు తాగితివి అని ప్రశ్నించింది . అమ్మా ఒకటి ధనం అన్నావు. మరొకటి విద్య అన్నావు. రెండింటిని వదులుకోలేక పోతిని. ఎందుకో అంబ నాపై కోపగించక నవ్వి నీవు హాస్యకవిగా జీవించ గలవు అని పలికి అంతర్ధానమయినది. ఒక రకంగా చిన్నశాపానికి గురయితిని." వినమ్రంగా చెప్పాడు రామలింగడు.
"శాపమా ? ఏమని " రాయలు ప్రశ్నించాడు.
"ప్రభూ ఆ అంబకు ఈ రామలింగపుత్రుడన్నచో ఎంతో ప్రేమ అందుకే చిరుకోపములో కూడా నన్ను ఓ హాస్యకవిగా బతకగలవని వరం వంటి శాపం ఇచ్చింది. వాస్తవానికి నేను నా కావ్యరచనల్లో హాస్యంపై ఆధారపడినది లేదు. కానీ అంబపలుకు ఆ విధంగా ఉంది. మరి మున్ముందు అలా రాస్తానేమో !"
" మీకావ్యాలలో కాకపోవచ్చు కానీ మీ కదలికలు హాస్యాన్ని గుమ్మరిస్తున్నాయి.” అని రాయలు సంతృప్తిగా నవ్వాడు. పూజారులు చేష్టలుడిగి మరీ రామలింగనివైపు చూసారు.
"ప్రభూ తొలికలయికలో తమ యొక్కఅభిమానాన్నిపొందాను. నిజంగా నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఈరోజుచాలా ఆనందంగా ఉంది.
Comments