ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Bhagirathudu Gangani Bhumi Medaku Ela tesukuvachhadu?

 భగీరథుడు గంగని భూమి మీదకు ఎలా తీసుకు వచ్చాడు?


గరుత్మంతుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్పాను కదా! గరుక్మంతుడు ప్రత్యక్షమయ్యాక

అంశుమంతుడి తో ఇలా అంటాడు,
ఈ భూమిలోని ఏ జలంతో జల తర్పణ చేసిన నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వారు స్వర్గానికి వెళ్లాలి అంటే నీవు స్వర్గంలో ఉండే గంగా జలముతో ఆ భస్మాన్ని తడపాలి అని అలాగే దానికోసం ప్రయత్నించు అని  చెబుతాడు.

తరువాత అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశాడు. తన 60 వేల కొడుకులు భస్మం అయ్యారు అని తెలుసుకొని సగరుడు చాలా బాధపడ్డాడు.

తరువాత కొన్ని సంవత్సరాలు సగరుడు రాజ్యపాలన చేసి తన శరీరాన్ని వదిలాడు.  తరువాత సగరుడి మనుమడైన అంశుమంతుడు రాజ్యపాలన చేశాడు, ఆయన 32 వేల సంవత్సరాలు తపస్సు చేసి తపస్సు లోనే శరీరాన్ని వదిలి వేసాడు.

తరువాత అంసుమంతుడి కుమారుడైన దిలీపుడు రాజ్యపాలన చేశాడు. అతడు గంగను భూమి మీదకు తీసుకు రాలేకపోయాడు, తరువాత  
దిలీపుడి కుమారుడైనా భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి గోకర్ణ క్షేత్రంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకు బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు. అప్పుడు భగీరథుడు నాకు సంతానం లేదు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండటానికి నాకు కుమారులు కలిగేలా వరం ఇవ్వండి అన్నాడు, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం గంగను భూమి మీదకు పంపించండి అన్నాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు నీ మొదటి కోరిక నేను తీరుస్తాను, కానీ గంగను భూమి మీదకు వదిలితే దానిని ఆపగలిగే వాడు అక్కడే శివుడు ఒక్కడే, కనుక శివుని కోసం తపస్సు చేయి ఆయన ఒప్పుకుంటే భూమి మీద వస్తుంది అన్నాడు.

అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనవేలి మీద నిలబడి ఒక సంవత్సరం పాటు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై గంగను తన శిరస్సుపై ధరిస్తాను అని అన్నాడు.

అప్పుడు శివుడు హిమాలయాల మీద నిలబడి తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. అప్పుడు గంగ గర్వంతో తన మనసులో ఇలా అనుకుంది: నా ప్రవాహంలో శివుడిని కూడా పాతాళానికి తీసుకు వెళ్తాను అని  అనుకుని శివుని జటాజూటంలో జారింది.

అలా గంగా ఒక సంవత్సరం పాటు శివుని జటాజూటంలో పడుతూనే ఉంది కానీ, భూమి మీద ఒక్క చుక్క నీరు కూడా పడలేదు అలా శివుని జటాజూటంలోనే తిరుగుతూ ఉంది.

 మళ్లీ భగీరథుడు శివుణ్ణి ప్రార్థించగా శివుడు గంగను బిందు సరోవరం లో వదిలాడు. అప్పుడు ఆ గంగా నది హ్లాదిని, పావని, నళిని అని మూడు పాయలుగా తూర్పు దిక్కుగా వెళ్ళింది. సుచక్షువు, సీతా, సింధువు అనే మూడు పాయలు పడమర దిక్కుకు, ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల గంగ ప్రవహించింది. ఆ అపూర్వమైన ఘట్టం చూడటం కోసం దేవతలు ఆకాశంలో నిలబడ్డారు.

అలా వెళ్తూ ఉండగా అక్కడ యాగం చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన మహర్షి గంగను మింగేశారు, భగీరథుడు వెనుకకు తిరిగి చూస్తే ఏమీ లేదు వెంటనే భగీరధుడు జహ్ను మహర్షి ని ప్రార్ధించగా మహర్షి తన చెవుల నుండి గంగను వదిలాడు.

జహ్ను మహర్షి చెవుల నుండి వచ్చింది కనుక గంగను జాహ్నవి అంటారు. అలా గంగా పాతాళలోకానికి వెళ్లి అక్కడ భగీరథుడి పితృదేవతల భస్మల మీదగా ప్రవహించింది, దానితో సగరులు స్వర్గానికి వెళ్ళారు.

స్వర్గలోకములో ప్రవహించేటప్పుడు గంగను మందాకినీ అని, భగీరథుడు భూమిమీదకి తెచ్చాడు కనుక భాగీరధీ, భగవతి అని పిలుస్తారు.
 ఈ విధముగా గంగావతరణం జరిగింది.

 ఇది విన్న రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని మరునాడు ఒక నగరానికి వెళ్లారు.




←Prev                                                                                                                                                                                                                                   Next→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు