ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Ksheera sagara Madhanam enduku jarigindi?

 క్షీరసాగర మధనం ఎందుకు జరిగింది?

గంగావతరణం గురించి తెలుసుకున్నాక తర్వాతి రోజు వారు ఒక నగరానికి వెళ్తారు, ఆ నగరం గురించి చెప్పమని రామలక్ష్మణులు విశ్వామిత్రుని అడుగుతారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు:

 పూర్వం కృతయుగం(సత్యయుగం)లో కశ్యప ప్రజాపతి ఇరువురి భార్యలైన  అదితి మరియు దితి వారి పుత్రులు అయినా దేవతలు, రాక్షసులు ఎంతో సఖ్యతగా కలిసిమెలిసి జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వారికి శాశ్వతంగా జీవించాలి అని కోరిక పుట్టింది దానితో వారు క్షీర సాగరాన్ని మధిస్తే అమృతం వస్తుంది. దానితో మనకు ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు అని క్షీరసాగరాన్ని మధించాలి అని నిర్ణయించుకున్నారు.

 దానికోసం మంధర పర్వతాన్ని  పెకళించి తీసుకువచ్చి క్షీరసాగరం లో పడివేశారు. వాసుకిని తాడుగా ఆ పర్వతానికి చుట్టారు. మందర పర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా క్షీరసాగరాన్ని చిలక సాగారు.

అలా చిలుకుతుండగా 1000 సంవత్సరాలు తరువాత అందులోనుంచి ముందుగా హాలాహలం పుట్టింది. దానితో ఆ హాలాహలం రాక్షసులని, దేవతలను, మనుషులను అలాగే లోకం మొత్తం నాశనం అవ్వడం మొదలయింది.

అప్పుడు దేవతలంతా రక్షించమని మహేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు అక్కడికి వచ్చిన విష్ణుమూర్తి నవ్వుతూ శివుడితో అందరికన్నా పెద్ద వారు మీరే కనుక మొదట వచ్చిన దానిని మీరే స్వీకరించాలి అని అన్నారు.
అప్పుడు ఆ హాలాహలాన్ని శివుడు తాగాడు కానీ అతనికి ఏమీ కాలేదు.

సంతోషంతో మళ్లీ మంధర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు, అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది వెంటనే అందరూ పర్వతాన్ని పైకి తీసుకు రమ్మని విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు కూర్మావతారం ధరించి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు. దానితో మళ్లీ క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెట్టారు.

 కొన్ని సంవత్సరాలు తరువాత చీర సాగరం నుండి ధన్వంతరీ, అప్సరసలు పుట్టారు నీళ్లను మధించగా  వచ్చిన రసం నుండి పుట్టారు కనుక వారిని అప్సరసలు అంటారు. అలా వచ్చిన అందమైన అప్సరసలను వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు, అందుకే వారు దేవ వేశ్యలు అయ్యారు.

తరువాత వరుణిని  కుమార్తె అయిన వారుణి అనే సురసం(అంటే మద్యం) అనే రసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కనుక వారిని సురులు అంటారు, రాక్షసులు ఆ సుర రసాన్ని స్వీకరించలేదు కనుక వారిని అసురులు అంటారు.

మళ్లీ మంధర పర్వతాన్ని చిలకగా ఉచ్చైశ్రవం అనే  గుర్రం కౌస్తుభము అని మణి వచ్చాయి.

ఉచ్చైశ్రవము అనే గుర్రాన్ని రాక్షసులు స్వీకరించారు, కౌస్తుభము అనే మణిని విష్ణువు ధరించాడు.

తరువాత అమృతం పుడుతుంది. అమృతం కోసం దేవదానవులు పోట్లాడుకుంటూ వుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అమృతాన్ని దొంగిలించాడు. దానితో దేవతలకు అమృతం దొరుకుతుంది.

 అమృతం కోసం దేవతలు, దానవులు యుద్ధం చేసుకున్నారు, ఆ యుద్ధంలో అసురులు నాశనమయ్యారు.

దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడు అసురులను చంపి ముల్లోకాలకు అధిపతి అయ్యాడు.

అప్పుడు అసురుల తల్లి అయినది దితి తన భర్త అయిన కశ్యపు దగ్గరకు వెళ్లి నీ కుమారుడైన ఇంద్రుడు నా కొడుకులను నాశనం చేసాడు, నాకు ఇంద్రుడిని జయించే కొడుకు కావాలి అని అడిగింది, అప్పుడు కశ్యపుడు ఏమన్నాడో  తర్వాత తెలుసుకుందాం




←Prev                                                                                                                                                                                                           Next→




Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు