ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Indrudu diti Kadupuloni Pindanni enduku Khandinchadu?

 ఇంద్రుడు దితి కడుపులోని పిండాన్ని ఎందుకు ఖండించాడు?

ఇంతకు ముందు దితి కశ్యపుడిని ఇంద్రుడిని చంపగలిగే వాడిని కొడుకుగా ప్రసాదించమని వరం అడుగుతుంది కదా! అప్పుడు కశ్యపుడు ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం!

అప్పుడు కశ్యపుడు ఇప్పుడు నీవు కనక 1000 సంవత్సరాలు మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎలాంటి దోషం లేకుండా తపస్సు చేయగలిగితే నీకు ఈ లోకాన్ని శాసించగల, అలాగే ఇంద్రుని సంహరించగలదు కొడుకు పుడతాడు అని కశ్యపుడు చెప్పి దితిని ఆశీర్వదించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.

దితి సరే అని శుక్ల పవనం అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చేడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి నేను నీకు సేవ చేస్తాను అని అన్నాడు, దితి సరే అనడంతో ఇంద్రుడు కావాల్సినవన్నీ, అలాగే అన్ని రకాల సేవలు చేసేవాడు. ఆమె అలసిపోతే పాదాలు పట్టే వాడు, అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి.

దేవేంద్రుడు చేసిన సేవలకు సంతోషించిన దితి, ఓ  దేవేంద్ర!  నేను పరాక్రమవంతుడైన కొడుకు కోసం నీ తండ్రిని వరం అడిగాను. 1000 సంవత్సరాల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని కశ్యపుడు వరమిచ్చాడు, ఇంకో పది సంవత్సరాలలో నీకు సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు నా కుమారుడు కలిసి ఈ లోకాన్ని పాలించండి అని దితి దేవేంద్రుడి తో చెప్పింది.

తరువాత ఒక మిట్టమధ్యాహ్నం వేళ నిద్రించడానికి దితి లోపలికి వెళ్ళింది కానీ తొందరగా నిద్ర పోవాలని తల పెట్టుకుని నిద్ర చేయవలసిన వైపు కాళ్ళు పెట్టుకుని నిద్రపోయింది. ఆమె ప్రమేయం లేకుండానే దితి అపవిత్రం అయింది.

అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఇంద్రుడు అదే సమయంలో దితి గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని తన వజ్రాయుధంతో 7 ముక్కలు చేశాడు,
అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకద్దు అని అరిచింది. ఆ ఏడుపు దితికి వినబడి దితి కూడా నరకద్దు అని ప్రార్ధించింది. అప్పుడు దేవేంద్రుడు గర్భం నుండి బయటకు వచ్చి మీ మీద గౌరవంతో ఆ పిండాన్ని సంహరిచలేదు అని అన్నాడు.

అప్పుడు దితి చాలాసేపు ఏడ్చిన తరువాత ఇంద్రుడి తో నీదేం తప్పులేదు, దోషం చేసింది నేను నిన్ను నువ్వు కాపాడుకోవడానికి పిండాన్ని ఖండించావు, కానీ నా పిల్లలకి దేవతాస్వరూపమును ఇచ్చి వారిని వాయుస్కందులకు అధిదేవతలుగా చేయమని వరం కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మ లోకములోని, ఇంద్ర లోకములోని అంతరిక్షం అంతరిక్షం లోని వాయుస్కందలతో పాటు నాలుగు దిక్కులకు వాయుస్కందలుగా ఉండే వరమిచ్చాడు. ఆ ఏడుగురిని మరుత్తులు అని అంటారు.

ఓ రామ దితి ఇదే ప్రదేశంలో తపస్సు చేసింది, తరువాతి కాలంలో ఇష్వాకునకు అలంబుస అను ఆయన భార్యకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ నగరాన్ని విశాలుడు  నిర్మించాడు కనుక ఈ నగరాన్ని విశాల పురం అంటారు.

ఆ విశాలుడికి హేమచంద్రుడు, హేమచంద్రుడికి సుచంద్రుడు, సుచంద్రుడికి ధూమ్రస్వడు, ధూమ్రస్వడుకి సృంజయసుడు, సృంజయసుడికి  సహదేవుడు, సహదేవుడికి కుశాస్వడు, కుశాస్వడికి సోమదత్తుడు, సోమదత్తుడికి సుమతి జన్మించారు. ప్రస్తుతం సుమతి ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో చెప్తాడు.

తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకొన్న సుమతి ఆయనను సగౌరవంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేశాడు. సుమతి విశ్వామిత్రుడితో మీ పక్కన ఉన్న వారెవరు, సూర్యచంద్రుల ఉన్నారు అని అడుగుతారు.
అప్పుడు విశ్వామిత్రుడు వాళ్లను రామలక్ష్మణులని, దశరధుని పుత్రులని, నా యాగ సంరక్షణ కోసం వచ్చారని అన్ని విషయాలు చెప్పి మిథిలా నగరానికి బయలుదేరతారు.

 అలా మిథిలా నగరానికి వచ్చాక వాళ్లకు ఒక ఆశ్రమం కనబడుతుంది, అది చాలా అందంగా ఉంటుంది కానీ అక్కడ ఎవరూ లేరు అప్పుడు రాముడు విశ్వామిత్రుడితో ఈ ఆశ్రమం ఎందుకు ఇలా ఉంది అని అడుగుతారు


←Prev                                                                                                                                                                                                                                          NEXT→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు