కపిలమహర్షి ఎందుకు సగరపుత్రులను భస్మం చేసాడు?
విశ్వామిత్రుడు కుమారస్వామి జననం గురించి చెప్పాక రామలక్ష్మణులకి గంగావతరణ కథ చెబుతాడు, ఆ గంగావతరణ కథ చెబుతాను తెలుసుకోండి!
ఈ కథను మనం చిన్నప్పుడు చదివిన కథే అండి అదేనండి భగీరథుడు తపస్సు చేసి గంగాదేవిని భూమి మీదకు తీసుకు వస్తాడు కదా అదే కదా అని వివరంగా చెప్తాను:
సగరుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు, అతనికి ఇద్దరు భార్యలు వారి పేర్లు కేశిని, సుమతి. సుమతి గరుక్మంతుడు సోదరి, సగరుడు తనకు పిల్లలు కలగడం కోసం తన ఇద్దరు భార్యలతో కలిసి హిమాలయాల్లో ఉన్నా భృగు శ్రవణం దగ్గరకు వెళ్లి వంద సంవత్సరాలు తపస్సు చేశాడు, వారి తపస్సుకు సంతోషించి భృగు మహర్షి సగరుడితో ఇలా అన్నాడు:
నీకు ఉన్న ఇద్దరి భార్యలలో ఒకరికి ఒక కుమారుడు, ఇంకొకరికి అరవై వేల కుమారులు పుడతారు అని వరమిస్తాడు. అది విన్న కేశిని, సుమతి ఎవరికి ఎవరు అని మహర్షిని అడిగితే అది మీ ఇద్దరూ కోరుకున్నట్లుగా జరుగుతుంది అని చెబుతాడు. అప్పుడు పెద్ద భార్యైనా కేశిని తనకు వంశోద్ధారకుడు అయినా కొడుకు కావాలి అని అడిగింది, రెండవ భార్య 60 వేల కుమారులు కావాలి అని అడిగింది, దానికి భృగుమహర్షి సరే అన్నాడు.
కొంతకాలం తరువాత పెద్ద భార్యకు అసమంజుసుడు, రెండవ భార్యకు 60000 కుమారులు పుడతారు.
వారు పెరిగి పెద్దవారు అవుతూ ఉంటారు. పెద్ద భార్య కొడుకైన అసమంజుసుడు రోజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళి నీళ్లల్లో వదిలి వారి చావుకి కారణం అయ్యాడు. కొంతకాలానికి ఈ విషయం తెలిసి సగరుడు అసమంజుసుడిని రాజ్యం నుండి బహిష్కరించాడు అసమంజుసుడు కొడుకు అయిన అంశుమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు సగరుడు.
కొంతకాలం తరువాత సగరుడు అశ్వమేధయాగం కోసం గుర్రాన్ని వదిలిపెట్టాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరిస్తాడు, ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అశ్వం దొంగిలించబడితే ఫలితాలు దారుణంగా ఉంటాయని అక్కడ ఉన్న పండితులు సగరుడితో చెబుతారు. అప్పుడు సగరుడు తన 60,000 కొడుకులను పిలిచి గుర్రాన్ని ఎలా అయినా వెతికి తీసుకురండి అని పంపుతాడు. వారు ఎంత వెతికినా అశ్వం ఎక్కడా కనబడదు ఎక్కడ కనపడకపోయేసరికి సగర పుత్రులు ఆ విషయాన్ని సగర మహారాజుకి చెబుతారు.
అప్పుడు సగరుడు మీరు అశ్వాన్ని భూమి మొత్తం అంటే పాతాళలోకం దాకా తవ్వి అయిన వెతకండి అని సగరుడు తన పుత్రులకు చెబుతాడు.అప్పుడు సగర పుత్రులు భూమి మొత్తం తవ్వడం ప్రారంభించారు.
అప్పుడు దేవతలు అందరూ భయపడి బ్రహ్మ దగ్గరకు వెళ్లి బ్రహ్మదేవా! సగర పుత్రులు భూమి మొత్తం తవ్వి పాడు చేస్తున్నారు, దానితో ప్రాణులన్నీ చనిపోతున్నాయి, అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో మీరు కంగారు పడకండి ఈ భూమి ఎంత శ్రీమహావిష్ణువుది కనుక ఆయనే రక్షిస్తాడు. ప్రస్తుతం ఆయన పాతాళలోకములో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్తాడు.
ఎంత తవ్వినా అశ్వం కనపడలేదు దానితో వారు పాతాళలోకం దాకా తవ్వడం మొదలుపెడతారు.
అలా తవ్వుతున్న వారికి భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది, ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకు వెళ్ళాక వారికి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది, అలాగే పడమర దిక్కున సౌమనసం ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగు కనిపించాయి. వారు ఆ ఏనుగులకు ప్రదక్షిణ చేశారు.
నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు ఈశాన్యం వైపు తవ్వడం మొదలుపెట్టారు, అప్పుడు వారికి ఒక ఆశ్రమంలో విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు, ఆయన పక్కన యాగాశ్వం ఉన్నది. కనుక మహర్షిని దొంగిలించాడు అనుకుని, ఆయనను కొట్టడానికి సగర పుత్రులు పరుగులు తీశారు వెంటనే కోపంతో కపిల మహర్షి కోపంతో ఒక అరుపు అరిచారు, దానితో ఆ 60 వేల సగర పుత్రులు భస్మం అయిపోయారు ఎంతకాలమైనా సగర పుత్రులు రాకపోయేసరికి సగరుడు తన మనుమడైనా అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు.
తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న తన పినతండ్రులు భస్మాన్ని చూసి బాధపడ్డాడు.
వానికి చనిపోయాక జరగాల్సిన కార్యక్రమాలు జరపడం కోసం నీళ్లు తీసుకురావడానికి బయలుదేరాడు
అప్పుడు అంశుమంతుడికి సగర పుత్రుల మేనమామ అయినా గరుక్మంతుడు ప్రత్యక్షమవుతాడు.
Comments