ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
సుమంత్రుడు రామ మందిరానికి చేరడం
సూర్యోదయం అయింది, వసిష్ఠుడు, బ్రాహ్మణులు, వర్తక ప్రముఖులు, రాజోద్యోగులంతా రాముని భవంతి ముందు వేచి ఉన్నారు. పుష్యమీ నక్షత్రాన రాముడి జన్మలగ్నమైన కర్కాటక లగ్నంలో రామరాజ్యాభిషేకం జరగాల్సి ఉంది. ఏర్పాట్లన్నీ అయ్యాయి.
అభిషేకం కోసం భద్రపీఠాన్ని (రాజాసనం) తెచ్చారు. నాలుగు గుర్రాలు పూన్చిన రథం సిద్ధంగా ఉంది. రథంలో కూర్చోవటానికి పులితోలు పరిచారు. బోయీలతో పల్లకీ కూడా సిద్ధంగా ఉంది. గంగోదకం, ఇతర నదుల్లో నుంచి తెప్పించి ఉంచిన పవిత్ర జలాలు, పవిత్ర సరస్సులనుండి, బావులనుండి, సప్తసముద్రాలనుండి తెప్పించిన జలాలన్నీ బంగారు కలశాల్లో నింపి సిద్ధంగా ఉంచారు. ఆ కలశాలను రావి ఆకులతోను, తామరపూలతోను, కలువపూవులతోను మూసి ఉంచారు.
తేనె, నెయ్యి, పాలు, నవధాన్యాలు, దర్భలు, నవరత్నాలు, ఖడ్గం, ధనుస్సు మున్నగునవన్నీ సిద్ధంచేశారు. తెల్లని ఆబోతును తెచ్చారు. దాని పెద్ద మూపురానికి తెల్లటి వస్త్రాన్ని ధరింపజేశారు. మెడ నిండా జూలు వేళ్ళాడుతున్న నాలుగు గుర్రాలు, పర్వతం అంత ఎత్తున ఉన్న మదించిన ఏనుగు, ఆవులు, మృగాలు, అనేక రకాలైన పక్షుల్నీ సిద్ధంగా ఉంచారు. చక్కగా అలంకరించుకొన్న అందమైన వేశ్యలున్నారు. అనేక రకాలైన వాద్యాలు, గాయకులు, నర్తకులు, నటులంతా వేచిఉన్నారు.
ఇక్ష్వాకువంశపు రాజుల రాజ్యాభిషేకానికి ఆనవాయితీగా ఇచ్చే బహుమతులన్నీ చేతబట్టుకొని రాజులు, సామంతులు, పురప్రముఖులు మహారాజు దర్శనానికై బయట వేచి ఉన్నారు. ఇంకా మహారాజు బయటకు రాలేదే అని తహతహలాడుతున్నారు. మహారాజుకు ఎవరిచేత కబురు పంపటమా అని తటపటాయిస్తున్నారు.
ఇంతలో సుమంత్రుడు వారితో ఇలా అన్నాడు: మహాజనులారా! రాజోత్తములారా! మీరంతా మహారాజుగారి దర్శనం చెయ్యాలనీ, బహుమతులను అందజేసి ఆయనచే గౌరవింపబడాలనీ కుతూహలపడుతున్నారు. నేను వెళ్ళి మహారాజును నిద్రలేపి, మీకు దర్శనం అయ్యే ఏర్పాట్లు చేస్తాను. వేచి ఉండండి.
తరువాత సుమంత్రుడు అంతఃపురంలోనికి వెళ్ళి దశరథునితో ఇలా చెప్పాడు: ఓ మహారాజా! తెల్లవారిపోయింది. సామంతరాజులంతా కానుకలు తీసుకొని బయట తమ దర్శనం కోసమే వేచి ఉన్నారు. ఇక మీరు లేచి వచ్చి వారికి దర్శనమీయాలి.
అప్పుడు దశరథుడు సుమంత్రుడితో ఇలా అన్నాడు: ఓయీ సుమంతా! నేను రాత్రి అంతా నిద్రపోలేదు. రాముణ్ణి ఇక్కడకు తీసుకురమ్మని కైకేయి నా మాటగా చెప్పింది. అది నా ఆజ్ఞగానే స్వీకరించు. వెంటనే వెళ్ళి రాముణ్ణి ఇక్కడకు తీసుకొని రా.
అంతట సుమంత్రుడు పైకప్పు కలిగిన రథాన్ని అధిరోహించి రామ మందిరానికి బయలుదేరాడు. మార్గమంతా జనసందోహంతో ఆనందోత్సాహంతో ఉండటం చూసి చాలా సంతోషించాడు.
ప్రజలంతా కానుకలు చేతపుచ్చుకొని రామదర్శనానికై నిలబడ్డారు. పురప్రముఖులు, సామంతరాజులు కూడా రామదర్శనార్ధం నిరీక్షిస్తున్నారు. వారందరినీ చూస్తూ ఇంకొద్దిసేపట్లో రాముడు రాజవుతాడని సుమంత్రుడు సంతోషంతో ముందుకు సాగిపోయాడు.
రాజభవనం తెల్లగా కైలాసపర్వతంలా ఉంది. మేరుపర్వతంలా మెరిసిపోతోంది. చందనాగరు ధూపాలతో సువాసనలు వెదజల్లుతున్నది. వాకిళ్ళన్నీ రత్నాలతోను, మాణిక్యాలతోనూ పొదగబడి కుబేరుని భవనంలాగా సర్వసమృద్ధితో విరాజిల్లుతోంది. వాకిళ్ళకు ముత్యాల తోరణాలు కట్టారు. అవన్నీ సూర్యకాంతి పడి ధగధగా మెరుస్తున్నాయి. గోడల మీద, స్తంభాల మీద విలువైన చిత్రాలు అలంకరించబడ్డాయి. రకరకాల పక్షులు కిలకిలారావాలు చేస్తూ రాజభవనమంతా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అవేవీ ద్వారపాలకులను లెక్కచేయకుండా తమ ఇష్టానికి ఎగురుతున్నాయి.
సుమంత్రుడు మూడు ప్రాకారాలను దాటి రామమందిరాన్ని చేరుకున్నాడు. వాకిట్లో పర్వతంలాంటి 'శత్రుంజయ మనే మదపుటేనుగు ఒకటి రాముని తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. ఏడు అంతస్తులు దాటుకొని సుమంత్రుడు రాముని మందిరాన్ని చేరుకున్నాడు.
Comments