ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
సీతారాముల ఉపవాసదీక్ష
తన దగ్గరనుండి రాముడు వెళ్లి పోయిన తరువాత దశరథుడు తన పురోహితుడు వసిష్టుని పిలిపించాడు. ఆయనతో ఇలా అన్నాడు: “ఓ వసిష్ట మహామునీ! రేపే రామునికి యువరాజ్య వట్టాభిషేకము నిశ్చయించాము కదా. అందుకని మీరు రాముని మందిరమునకు వెళ్లి, రాజ్యము, యశస్సు, సంపదలు కలిగేటట్లు రామునితో, సీతతో ఈ రోజు ఉపవాసవ్రతము చేయించండి.” అని అన్నాడు.
దశరథుని ఆదేశానుసారము వసిష్టుడు రాముని మందిరమునకు వెళ్లాడు. తన మందిరమునకు వచ్చిన వసిష్టునికి రాముడు ఎదురు వచ్చి, స్వాగత సత్కారములు చేసాడు. ఉచితాసనము మీద కూర్చో పెట్టాడు. అప్పుడు వసిష్టుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! రేపు ఉదయము నీకు యువరాజ్య పట్టాభిషేకము చేయవలెనని నీ తండ్రి దశరథుడు సంకల్పించాడు. ఆ సందర్భంలో నీవు ఈ రోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతము చేయాలి” అని అన్నాడు. రాముడు సరే అన్నాడు. వసిష్టుడు రామునితో సీతతో వేదోక్తంగా ఉపవాసవ్రతము చేయించాడు. రాముడు సీత తమ గురువు గారైన వసిష్టును యధోచితంగా పూజించారు. తరువాత వసిష్టుడు రాముని మందిరము నుండి వెళ్లిపోయాడు.
ఈ వార్తవిన్న రాముని మిత్రులు, బంధువులు రాముని మందిరమునకు చేరుకున్నారు. రాముడు వారందరితో ప్రేమతో మాట్లాడాడు. రాముని మందిరము అంతా ఆ రాత్రి బంధుమిత్రులతో కళకళలాడింది.
మరునాడే పట్టాభిషేక మహోత్సవము కావడంతో అయోధ్యానగర వీధులన్నీ జనంతో కిట కిట లాడుతున్నాయి. నగరమంతా పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తున్హారు. పుర వీధులు అన్నీ పన్నీటితో తడిపారు. అరటి స్తంభాలు కట్టారు. తోరణాలు కట్టారు. జండాలతో అలంకరించారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. స్త్రీలు, బాలురు, వ్యద్ధులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు. రామ మందిరము నుండి బయలు దేరిన వసిష్టుడు, దారిలో క్రిక్కిరిసి ఉన్న జనమును తోసుకుంటూ అతి ప్రయాసతో దశరథుని భవనమును చేరుకున్నాడు. దశరథుని కలుసుకున్నాడు.
ఓ వసిష్ట మహామునీ! రామునితో నేను చెప్పినవి అన్నీ చేయించారా!” అని అడిగాడు.“అంతా మీరుచెప్పినట్టే చేయించాను.” అని చెప్పాడు వసిష్టుడు.
అప్పటిదాకా దశరథుడు పురప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నాడు. వసిష్టుడు వచ్చిన తరువాత, వారందరినీ పంపివేసాడు.తాను కూడా తన అంత:పురములోకి వెళ్లాడు.
Comments