ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

రాముడు కౌసల్యాదేవిని సందర్శించటం || Raamudu Kowsalyadevini Sandarshinchatam || Ramayanam || Episode 38

 

రాముడు కౌసల్యాదేవిని సందర్శించటం

రాముడూ, సభాసదులు ఎవరి ఇళ్ళకు వారు వెళ్లారు. పిదప దశరథుడు మంత్రులతో ఆలోచించి “రేపే పుష్యమీ నక్షత్రం. రాముని రాజ్యాభిషిక్తుని చేయాలి. నా మనస్సు ఇంకొకసారి రాముణ్ఞి చూడాలని వేధిస్తోంది. ఓయీ! సుమంతా ! నువ్వు వెళ్లి నా మాటగా చెప్పి రాముణ్ణి ఇక్కడకు తీసుకొని రా అన్నాడు.

దశరథుని ఆజ్ఞ మేరకు సుమంతుడు రాముని అంతఃపురానికి వెళ్ళి మహారాజు ఆదేశాన్ని రామునికి తెలిపాడు. తరువాత రాముడు తండ్రి ఎందుకు ఇంత తక్కువ వ్యవధిలో మళ్లీ పిలిపిస్తున్నాడని విస్తుపోతూ సుమంత్రుని వెంట రాజప్రాసాదానికి వెళ్తాడు. తండ్రిని చూడగానే
రాముడు దోసిలి ఒగ్గి నమస్కరించాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి లేవనెత్తి కౌగలించుకొని అతడికి ఆసనం చూపి కూర్చోమన్నాడు.

అప్పుడు రాముడిని చూసి దశరథుడు ఇలా పలికాడు: రామా! దీర్జాయుష్మంతుడనైన నేను వృద్ధడనయ్యాను. అన్నదానాలు, వందలాది. యజ్ఞాలు, భూదానాలు, సత్కార్యాలన్నీ చేశాను. బ్రాహ్మణులకు పుష్కలంగా దక్షిణలిచ్చాను.

రామా! సమస్త సుఖాలను అనుభవించాను. యజ్ఞాలు చేసి దేవతాఋణాలు తీర్చాను. రకరకాలైన దానాలు చేసి ఋషిబుణాన్ని తీర్చాను. సంతానాన్ని కని పితృ రుణాన్ని తీర్చాను. శరీరధర్మంగా తీర్పవలసిన ఋణాలన్నీ తీర్చాను. చేయవలసిన ధర్మాలన్నీ ఆచరించాను. ఇక నీ రాజ్యాభిషేకం చేయడంతో నేను అన్నివిధాలైన బాధ్యతల నుండి విముక్తుడనవుతాను. కనుక రామా! నేను చెప్పిన విధంగా చేయి.

రామా! ప్రజలందరూ నువ్వే రాజువు కావాలని కోరుకుంటున్నారు. అటువంటి ఈ శుభ సమయంలో ఎందువల్లనో కొన్ని భయంకరమైన స్వప్నాలచే, దుశ్శకునాలచే నా మనస్సు కలవరపడుతోంది. పగలే ఆకాశం నుండి ఉల్కలు రాలిపడటం చూస్తున్నాను. నా జాతకరీత్యా,
రవి, కుజ, రాహువులు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించుకున్నారని, అటువంటిప్పుడు నాకు మరణంగాని, గొప్ప విపత్తుగాని అనుభవిస్తుందని దైవజ్ఞులు చెబుతున్నారు.

కనుక రామా! నాకు ఏదైనా అసందర్భమైన సంఘటనలు జరుగక ముందే నువ్వు రాజ్యాభిషిక్తుడవవు. ఎందువలనంటే, మనస్సు చంచలమైనది. అంతేకాక గ్రహదోషంచే కూడా పీడించబడుతున్నాను. ఇప్పుడే చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ప్రవేశించాడు. రేపు
ఉదయానికల్లా చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి వచ్చి చేరుకుంటాడు. ఆ ముహూర్తం దివ్యంగా ఉన్నదని దైవజ్ఞులు నిర్ణయించారు. రేపు ఉదయాన్నే నిన్ను రాజ్యాభిషిక్తుణ్ఞి చేస్తాను. ఎందువల్లనో నా మనస్సు కలక చెందుతోంది. ఏం జరుగబోతుందోనని కీడు శంకిస్తోంది సుమా!

కనుక రామా! నువ్వు సీతతో కలసి ఉపవాసం చేసి శయనించు. కుమారా! ఇటువంటి సమయాల్లో అనేక విఘ్నాలు, విపత్తులు కలుగుతాయి. నువ్వు, నీ మిత్రులంతా కలసి నన్ను రక్షించాలి. నీ తమ్ముడు భరతుడు ఇక్కడ లేని సమయంలోనే నీ రాజ్యాభిషేకం జరగాలని ఈ ఏర్పాట్లన్నీ అతిత్వరగా చేయిస్తున్నాను.

నిజానికి భరతునికి నీ పట్ల విపరీకమైన ప్రేమాభిమానాలున్నాయి. ధర్మబుద్ధి గలవాడు; ఇంద్రియనిగ్రహం _ కలిగినవాడు. భరతుడెప్పుడూ సత్సురుషులు ఆచరించే మార్గాన్నే అనుసరిస్తాడు. అయినా అటువంటివారి మనన్సు కూడా ఒక్కో సమయంలో చంచలం గావచ్చు గదా!

అంతట రాముడు దశరథునకు నమస్కరించి తన అంతఃపురానికి చేరుకొన్నాడు. అక్కడ నుండి తల్లియైన కౌసల్యాదేవిని చూడదలచి ఆమె అంతఃపురానికి వెళ్లాడు.

రాముడు వెళ్ళే నమయానికి కౌసల్యాదేవి చక్కగా అలంకరించుకొని ధ్యానముద్ర వహించి మౌనంగా మహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రార్థిన్తూన్నది. రాముని రాజ్యాభిషేక వార్త విని, సుమిత్రను, లక్ష్మణుని, సీతను పిలిపించింది. రాముడు వెళ్ళేసరికి వారూ అక్కడే ఉన్నారు.

అప్పుడు రాముడు తన తల్లితో ఇలా అన్నాడు : తల్లీ! నన్ను ప్రజాపాలన చేయవలసినదని తండ్రిగారు ఆజ్ఞాపించారు. అందుకై రేపు పుష్యమీ నక్షత్రాన రాజ్యాభిషేకం జరుగగలదని, నన్ను, సీతను ఉపవాసదీక్ష వహించి దర్భలపై శయనించమని ఆదేశించారు... కనుక నాకు, సీతకు నువ్వు చేయదలచిన మంగళకార్యాలన్నీ ఇప్పుడే జరిపించు అని అన్నాడు. 

'అప్పుడు కౌశల్య రాముడిని చూసి ఇలా అంది : నాయనా! రామా! దీర్దాయుష్మాన్‌ భవ! ఐశ్వర్యాలతో కూడినవాడవై నా జ్ఞాతులను, సుమిత్ర జ్ఞాతులను తరింపచేయి. శత్రుభయంకరుడవుగా!

నాయనా! రామా! నువ్వు సర్వమంగళకరమైన నక్షత్రాన పుట్టావు. అందువల్లనే నీ సద్గుణాలలో నీ తండ్రికి సంతోషాన్ని కలిగిస్తున్నావు. నాయనా! నీ కోసం మహావిష్ణువును నిష్టతో ఆరాధించాను. నా తపస్సు ఫలించింది. ఇక్ష్వాకు వంశస్తుడైన నిన్ను ఈ రోజు రాజ్యలక్ష్మి
ఆశ్రయిస్తుంది.

ఈ విధంగా పలికిన తల్లి మాటలు విన్న రాముడు, తన పక్కనే అణకువతో చేతులు,కట్టుకొని ఉన్న లక్ష్మణునితో మందహానం చేస్తూ ఇలా అన్నాడు:

లక్ష్మణా! నువ్వు నాకు ఆరవ ప్రాణం కావటంచేత ఈ రాజ్యలక్ష్మి నాతోపాటు నిన్నుకూడా ఆశ్రయిస్తోంది.. నువ్వు కూడా ఈ రాజ్యాన్ని పాలించు. లక్ష్మణా! నేను తండ్రిగారి ఆజ్ఞను శిరసావహించి రాజ్యభిషేకాన్ని అంగీకరించేది నీ కోసమే సుమా! నీ కిష్టమైన భోగాలన్నీ
అనుభవించు. ఇతర రాజ్యఫలాలను కూడా నువ్వే అనుభవించు.

అని ఇలా పలికి రాముడు తల్లుల వద్ద సెలవు పుచ్చుకొని సీఠతో తన అంతఃపురానికి వెళ్లాడు.




                                                                                                                                   ← PREV || NEXT →

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు