ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

అలంకారవతి చంద్రవర్ణుడిని మోహించుట || Alamkaravathi Chandravarnudini Mohinchuta || Episode 11 || Bhatti Vikramarka Kathalu

 

అలంకారవతి చంద్రవర్ణుడిని మోహించుట 

అలంకారవతి చంద్రవర్ణుడిని మేలుకొలిపి అతని వృత్తాంతం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది. అతనిని చూసిన మొదలు దృఢంగా ఉన్న నా చిత్తం ఇతని యందు లగ్నమై అధికమైన ఇష్టం కలుగుతుంది. సుందరాంగుడైన ఇతనితో సంభాషించకపోతే నేను ఇంకా ఒక్క క్షణము కూడా  నా తనువు నిలవదని అనుకోని, మిక్కిలి మొహంతో అతనిని మేలుకొల్పడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది,  కానీ ఎలాంటి ప్రయోజనం లేదు.ఆరు నెలల నుంచి నిద్ర లేకపోవడం వలన ఆ విప్రుడికి అలంకారవతి నిద్రలేపడానికి చేసిన పనులు ఒక్కటి కూడా తెలియవు. ఆ బ్రాహ్మణుడిని ఎంత పిలిచిన, అతనిని అటూ ఇటూ కదిలించిన, ఏమి చేసినా కానీ అతడు లేవకపోవడం చూసి అలంకారవతి ఇదేమి మాయా? ఇలాంటి నిద్ర కూడా ఉంటుందా? ఇతడు నిజంగా బ్రతికే ఉన్నాడా? ప్రాణాలు ఉంటే ఏమి చేసినా ఎంత పిలిచినా కానీ లేవకుండా ఉండడానికి గల కారణమేమిటి? అయ్యో! ఇంకా నేనేం చేయాలి? ఇతని వృత్తాంతం ఎలా తెలుసుకోవాలి? నాకు ఉన్న ఈ కోరిక ఎలా తొలుతుంది? అని అనుకుంది.

హరి హరి! ఇది ఒక ఆటంకం రావాలా? ఓ పాడు నిద్ర! ఎలా దాపరించితివి? జీవించి ఉన్నాడో లేదో అని సందేహించాను కానీ ఉచ్వాస నిశ్వాసములు కలిగి ఉండడం వలన ఇతడు బ్రతికే ఉన్నాడని దృఢంగా అనిపిస్తుంది.కానీ ఇతడికి ఇంత నిద్ర రావడానికి గల కారణం ఏమిటో తెలియట్లేదు. ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచించి వెంటనే ఇంటి లోపలికి వెళ్లి ఆ వృత్తంతం మొత్తం తన తల్లితో చెప్పి  ఆమెను కూడా అతని దగ్గరకు తీసుకొని వచ్చి చూపించింది.  అలంకారవతి తల్లి కూడా వచ్చి ఆ బ్రాహ్మణుడిని చూసి అతని రూపానికి తన పుత్రిక లాగే తను కూడా ఆశ్చర్యపడి అతనిని మేలుకొలపడానికి ప్రయత్నించి విఫలం అయింది. ఆ తల్లి కూతురు ఇతడు ఇలా నిద్రలేవకుండా ఉండడానికి కారణం ఏమిటి అని ఆలోచించి ఇతనికి ఏదైనా రోగం ఉందేమో, అందువలనే లేవట్లేదు అనుకొని, ఆ నగరంలో ప్రసిద్ధి చెందిన వైద్యుడిని పిలిపించి అతడు ఎందుకు లేవట్లేదు పరీక్షించి తెలుపమని అడిగింది. ఆ వైద్యుడు అతని నాడిని పరీక్షించి ఆ వైద్యుడు మంచి అనుభవ జ్ఞానం కలవాడు కనుక అతని గుణం గ్రహించి వారితో ఆ లక్షణాలు గురించి ఇలా పలికాడు:

ఓ అమ్మలారా!  ఇతడి నాడి చాలా తక్కువగా ఉన్నది. అయినా ప్రాణభయం కలిగే లక్షణాలు ఏమీ లేవు. అయినా కానీ ఇతడు ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే నాడిని పట్టి ఇతడు చాలా కాలం నుండి నిద్రాహారాలు వదిలివేసిన వదిలివేసిన వాడిలా ఉన్నవాడని అనిపిస్తుంది. అలా ఉండడానికి గల కారణం అతడు చెప్తేనే మనం తెలుసుకోగలం. ఇప్పుడు చేయవలసింది ఏమనగా మెత్తగా ఉడికిన అన్నాన్ని ఇతను దేహమును అంత మిశ్రమం చేసి రోజుకు నాలుగు ఐదు సార్లు రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వలన అన్నరసం అతని శరీరంలోకి దిగి రక్తనాడూలలో ప్రవేశించి అతని అవయవాలకు పట్టుతో కలుగుతుంది. తరువాత నిద్రమత్తు వదిలి  తెలివి పొంది లేవగలడు. ఇది తప్ప మరియొక చికిత్స గాని, ఔషధం ప్రయోగం కానీ చేయవలసిన అవసరం లేదు.  నేను చెప్పిన విధంగా చేయండి అని పలికి వెళ్ళిపోయాడు. నమ్మకస్తుడైన ఆ వైద్యుడు చెప్పిన ప్రకారం అలంకారవతి చేయాలని అనుకుంది, ఎన్ని కష్టాలు కలిగినా కూడా సహించి ఎలా అయినా అతనిని మేల్కొని అతని గురించి తెలుసుకోవాలని కోరికను నెరవేర్చుకోవాలి అన్న కారణము అలంకారవతి మనసులో గట్టిగా నాటుకుంది.



                                                                                                                                           ← PREV || NEXT→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు