ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

అలంకారవతి చంద్రవర్ణుడికి సేవలు చేయడం || Alamkaravathi Chandravarnudiki Sevalu Cheyadam || Episode 12 || Bhatti Vikramarka Kathalu

 

అలంకారవతి చంద్రవర్ణుడికి సేవలు చేయడం

ప్రతిరోజు రోజుకు 4 లేక 5 సార్లు అన్న మిశ్రమాన్ని అలంకారవతి చంద్రవర్ణుడికి శరీరానికి పట్టించి పరిచారికలతో బాగా రుద్దిస్తూ ఉండేది. ఈ విధంగా పది రోజులు గడిచిన తర్వాత అన్నరసం రోమ రంధ్రాల నుండి శరీరం లోపలికి ప్రవేశించడం వలన చంద్రవర్ణుడికి అలసట తీరి అటు ఇటు తిరిగి మెల్లగా కన్నులు తెరిచి చూసి తను అక్కడికి రావడం, అరుగు మీద పడుకోవడం అన్ని జ్ఞాపకం వచ్చి లేచి కూర్చున్నాడు. అప్పుడు జగన్మోహిని దేవతలాగా తనకు దగ్గర ఉండి సేవలు చేస్తున్న వేశ్యను చూసి తన అందానికి ఆశ్చర్యపోయి ఇలా తన మనసులో తను ఇలా అనుకున్నాడు: ఆహా! స్వర్గం నుండి దిగివచ్చిన ఇంద్రాణినా? లేక మదనుడు విడిచిపెట్టిన రతి దేవి అయి ఉంటుందా? ఈ అందమైన స్త్రీ ఎవరయి ఉంటారు? పరాయి వారికి ఇలాంటి అందము, మంచి లక్షణాలు ఉంటాయా?

అరెరే! రూపాన అధికులని చెప్పబడిన ఎక్కడా కూడా మచ్చ లేనటువంటి వారు ఇలా ఉంటారని తెలియదు. నేను ఈ మందిరానికి వచ్చినప్పుడు ఈ అలివేణిని చూడనే లేదు. ఎక్కడ నుంచి వచ్చిందో నా మీద ఏదో భక్తి ఉన్నట్టు ఈ రకంగా సేవలు చేస్తుంది. తను ఇలా సేవలు చేయడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, అది ఏమిటో తననే అడిగి తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అంతలో తాను నిదుర వీడి లేవడం చూసి సంతోషిస్తున్న అలంకారవతితో ఇలా అన్నాడు.

ఓ అందమైన స్త్రీ! రూపంలో రతీదేవిలా ఉన్న నువ్వు ఎవరు?  ఈ గృహం నీదే కదా! అనురాగం కలదానివై ఈ విధంగా నాకు నువ్వు తగిన సేవ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భగవంతుడు నీకు శుభములు ఇవ్వు గాక! నా మార్గమధ్యలో అలసిపోయి ఈ వీధిలో వస్తూ ఉండి ఇక్కడ నీ గృహం అందంగా కనబడడం వలన, మీ అంగీకారం లేకుండా సాహసించి లోపలికి వచ్చాను .లోపలికి వచ్చాక మీ అరుగుపై కొంత సమయం విశ్రాంతి తీసుకుని వెళ్లాలి అనుకున్నాను, కానీ అంతులో హాయిగా నిద్ర పట్టింది. మరలా మెలుకువే రాలేదు.ఎంత కాలం నిద్రించాను కూడా చెప్పలేను, మీ ఇంటిలో మిమ్మల్ని అడక్కుండా ప్రవేశించినందుకు నా నేరాన్ని మన్నించాలని వేడుకుంటున్నాను.

పుణ్యవతి వైన నీ సేవల వలన నా అలసట చాలా వరకు తీరింది. ఇప్పుడు మీరు నాకు ఇలా సేవలు చేయుటకు కారణం చెప్పండి అని అడిగాడు. అప్పుడు అతని మాటలకు అలంకారవతి చంద్రవర్ణుడితో ఇలా అంది:

సుందరాంగా! నా వృత్తాంతం అంత ముఖ్యమైనది కాదు. దానిని తర్వాత చెప్తాను కానీ, నువ్వు ఎవరివి? నీ నివాస స్థలమేది? ఇక్కడికి రావడానికి మా ఇంటిలో శయనించడానికి, ఇంతటి గాఢ నిద్ర నీకు కలగడానికి కారణం ఏమిటి? మీ పేరు, వంశము ఇవి మొదట తెలుపుము. నీ వృత్తాంతం తెలుసుకోవాలని నేను తెగ తహతహలాడుతున్నాను అని ప్రార్థించింది.

ఆ చిలక పలుకులు విని చంద్రవర్ణుడు అలాగే అని ఒప్పుకొని తన వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు: తన పేరు, తన ఊరు, తను తన గ్రామాన్ని విడిచి పెట్టడానికి గల కారణం నుంచి తను అలంకారవతి ఇంటిలో శయనించుట వరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. తరువాత అలంకారవతితో నువ్వు కోరిన ప్రకారం నా వృత్తాంతమంతా చెప్పాను, కనుక ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పు అని అడగగా అంతటా అలంకారవతి కూడా తన గురించి చెప్పింది. తర్వాత అలంకారవతి బ్రాహ్మణుడితో ఓ బ్రాహ్మణోత్తమా! ఇక్కడ శయనించి ఉన్న నిన్ను చూడగానే నా మనసు నీ మీద లగ్నమైంది కావున మానసికంగా నా మనసులో మనోవాక్కాయ కర్మలను నీకు అర్పణం చేసి నువ్వే నా భర్తవని అనుకున్నాను. నీవు గాఢ నిద్రలో ఉండడం వలన అప్పుడే నా అభిప్రాయం చెప్పడానికి కుదరలేదు.

                                                                                                                         ←PREV || NEXT→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు