ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
అలంకారవతి చంద్రవర్ణుడిని పెళ్లాడమని ప్రార్థించుట
నిన్ను మేలుకొలిపి నా కోరిక మీకు తెలియజేయాలి అని అనుకోని నీకు మెలకువ కలిగించడం కోసం నేను పడిన కష్టం ఇంతింత కాదు. దేవుని కృపవలన నీతో మాట్లాడే భాగ్యం నాకు కలిగింది. ఇప్పుడేమీ మించిపోలేదు, నువ్వు కూడా అవివాహితుడివి, నేను అలాంటి దానిని వేశ్య గర్భంలో జన్మించిన నా ఆలోచన వేరు. పడుపు వృత్తి చేయడానికి నా మనసు ఎప్పుడూ ఒప్పుకోలేదు, భగవంతుడి సాక్షిగా ఈ క్షణం వరకు నామీద ఎలాంటి కళంకం కలగదని ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను. నేను ఒక ఉత్తమునికి భార్యనై సుఖపడడానికి నిర్ణయించుకున్నాను. నా పూర్వకృత పుణ్యం మంచిది అవడం వలన ఉత్తమ కులంలో జన్మించిన నీవు నా పతి అవడం జరుగుతుంది. నేను నిన్ను వరించి మానసికంగా నీకు భార్యను అయ్యాను.
పదిమందికి తెలిసేలాగా నన్ను పెళ్లాడి నా తోడుతో ఇష్ట సుఖాలను అనుభవించండి. మహా మొహంతో వలచి వేడుకుంటున్న ఈ ప్రార్థనను నిరాకరించకుండా అంగీకరించండి అని వినయంతో పలికింది. ఆ ప్రకారం ఆ కన్య చెప్పిన మాటల విని రెండు చేతులతో తన రెండు చెవులు మూసుకుని చంద్రవర్ణుడు హరిహరీ! ఇదేమి కోరిక? ఇవి ఏమి మాటలు? నేనెవరిని? నువ్వు ఎవరు? బ్రాహ్మణుడైన నేను వేశ్య జాతిలో పుట్టిన నిన్ను పెళ్లాడటమా? బాగు బాగు, చాలు చాలు, ఇది ఎలా జరుగుతుంది? ఇలా పరిహాసానికి చెప్తున్నావో లేక నిజమో తెలియదు కానీ ఈ మాటలు ఎవరైనా విన్నా నవ్వుతారు సుమీ! నిన్ను పెళ్లి చేసుకోవడం చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటాను?
సుందరీమణీ! సత్యము గానే మీ అభిప్రాయం అటువంటిది అయి ఉంటే ఆ ఆలోచన మంచిది కాదు, ఆ ఆలోచన మర్చిపో. లోకము ఏమైనా గొడ్డు పోయిందా? పురుషులే లేరా? నీకు తగినవారిని వరించి పెళ్లాడా రాదా? బ్రాహ్మణుడిని అతని భార్యగా అవుతాను అని నువ్వు అడగడం అడగడం అర్హతయేనా? అయ్యో! పాపకృత్యమునికి ఏ వరుడైన ఒప్పుకుంటుంటాడా? అయ్యో! పసిదానివి పద్ధతులు తెలియక ఇలా చెప్పావు. అయిన నువ్వు నాకు మహోపకారం చేసిన దానివి అవడం వలన నీకు మేలు కోరుతూ ఇది చెపుతున్నాను. ఈ ఆలోచన క్షేమకరమైంది కాదు కాబట్టి సంసార న్యాయమను అనుసరించి ప్రవర్తించాలి కాబట్టి నీ అర్హత అయిన వాడిని ఒకరిని పెళ్లాడి సుఖింపుము. నీకు దేవుడు మేలు చేయను గాక ఇంకా నేను నా గ్రామానికి వెళ్తాను అని చెప్పి వెంటనే లేచి రావి ఆకుల మూట కట్టుకొని బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడేను. బ్రాహ్మణుడు అలా అనగానే అలంకారమతికి గుండె ఝల్లుమంది.
అలంకారవతి తన కోరిక తీరుతుంది అని, తన సౌందర్యం చూసి అతడు తనను మోహించి వరిస్తాడు అని అనుకుంది గాని ఆ ఆలోచన అంతా వమ్మయింది. తొందరగా నడుస్తూ బ్రాహ్మణుడికి దారికి అడ్డంగా నిలబడి దిగులుతో మదనపడుతూ అతనిని నిలువరించి ప్రియవల్లభా! నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? రా రమ్ము. క్షణమైనా ఇక నిన్ను విడిచి నేనుండలేను. నా జీవితం అంత నువ్వు గానే భావిస్తున్నాను, నువ్వు వెళ్ళిపోతే నా గతి ఏమిటి? నా ప్రాణాలు ఎలా భరిస్తాయి? జాతి విభేదం కలగడం వలన పెళ్లాడను అని అంటున్నావు. ఈ కార్యము ధర్మ విరుద్ధమని మహాపాపం కలుగుతుంది అని అంటున్నావు. ఎలా? తనకు తాను కోరి మానసికంగా శరీరాన్ని అర్పించిన యువతిని ఆదరించి కోరిక తీర్చకుండా నిరాకరించవచ్చునా?అది ధర్మమౌతుందా? పాపము కాదా? మహాత్ములైన ఋషులందరూ శుద్రకాంతలను కూడా ఇష్టపడి వారితో సుఖములను అనుభవించినది నువ్వు చదివి తెలుసుకున్న వాడివి కాదా? ఎన్ని గ్రంథాలలో అలాంటి చరిత్రలు రాయబడి ఉన్నాయో ఆలోచించు. మనోహర ఇది దోషము కాదు,నన్ను నిరాకరించకు, నేను నిన్ను విడవను. బ్రాహ్మణుడు అయిన నీకు దీనివలన పాపం కలుగుతుంది అంటే నేను నమ్మజాలను. ఒకవేళ కలుగుతుంది అంటే జపతప హోమాది క్రియలతో సకల దోషములను నివారించుకునే శక్తి మీకు కలదు. లేనిపోని సాకులు చెప్పి నన్ను విడిచిపోకు అని ఆపడానికి ప్రయత్నించింది.
అలంకారవతి పలుకులు ఆదరించక చంద్రవర్ణుడు ఆమె కోరిన కోరికకు సమ్మతించకుండా ఛీ! ఇది ఏమి ఉపద్రవము? నేను చేయలేని పనికి నన్ను బాధ పెట్టే సమ్మతించమంటావేంటి? నెరవేరే పని అవుతుందా? మేలు మేలు? జరుగు జరుగు,నన్ను పోనివ్వు. విసుక్కుంటూ మాటలు పలుకుతూ తన దారికి అడ్డముగా నిలిచి ఉన్న అలంకారవతిని తప్పించుకొని పోవడానికి ప్రయత్నించాడు. అంతమాత్రాన ఆ యువతి అతనిని విడిచింది కాదు. ఓహో పోతున్నావేంటి? నీతిమంతుల లక్షణం ఇలాగే ఉంటుందా? నా మనసును నీకు అర్పించి నీ భార్య నే ఉన్నాను, నిన్ను నమ్మినా అబలను నన్ను నిరాకరించి పోవడం ఎంతవరకు సమంజసం? నా భర్తవు, మాంగళ్యధారణ చేయనంత మాత్రాన మనం భార్యాభర్తలు కాకుండా పోతామా? నేను నిన్ను విడువను. మనమిద్దరం రాజ్యసభకు వెళ్లి ఈ రాజ్యాన్ని పాలించు రాజుతో మన వివాదాన్ని చెప్పి ఆ రాజుగారు ఎలా న్యాయాన్ని తీర్మానిస్తే ఆ రకంగా చేద్దాము అని అంది. వెంటనే పరమయోగ్యుడైన సాధువునైన చంద్రవర్ణుడిని గట్టిగా పట్టుకుని విడువక రాజ్య సభకు వెళ్లడం మొదలుపెట్టింది. యువతలకు సాహసం ఎక్కువ గదా! వారు ఎంతకైనా తెగిస్తారు. పాపం! చంద్రవర్ణుడు ఏమి చేస్తాడు? తాను పురుషుడై ఉండి కూడా ఆ యువతి పట్టును విడిపించుకుని విడిపించుకోలేకపోయాడు.
వీధి యందు పెనుగులాడితే చూసి పది మంది తెలుసుకుంటారు అని లజ్జ గల వాడై అలంకారవతి వెంట రాజ్యసభకు వెళ్లి అక్కడ నుండి తప్పించుకొని పోవచ్చు అని అనుకున్నాడు. రాజుగారు అక్రమమైన ఆ వేశ్య ఉద్దేశము న్యాయమని అలా చేయమని ఆజ్ఞాపించడు అని తనలో తాను నిశ్చయించుకుని మాట్లాడకుండా అలంకారవతి వెంట రాజ్యసభకు వెళ్లాడు.
Comments