ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Dasarathudu Mariyu Janaka Maharajula Vamsala Vivarana || Ramayanam

 

దశరథుడు మరియు జనక మహారాజుల వంశాల వివరణ

దశరథుడితో పాటు వశిష్టుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వారు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు.  అలాగే సాంకాశ అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు.

ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనకా మహారాజుతో ఇలా అన్నాడు:
 మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ట మహర్షి మా వంశం గురించి చెప్తారు" అన్నారు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజుగారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్టుడు చెప్పడం మొదలుపెట్టాడు.
మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు, మరీచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు పుట్టాడు. మనువు ప్రజాపతి అయ్యాడు. మనువుకి ఇక్ష్వాకు , ఆ ఇక్ష్వాకువు అయోధ్యను  మొట్ట మొదటి సరిగా పరిపాలించాడు.

 ఇక్వ్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు , పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి ధుంధుమారుడు, ధుంధుమారుడికి యువనాశ్వుడు, యువనాశ్వుడికి మాంధాత. మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజి త్తు అని ఇద్దరు కుమారులు. పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడి వరకు రాజ్యపాలనం చేశారు, ఈ అసితుడు హైహయుడు, తాలజంఘుడు, శశిబిందు అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు, తరువాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు, ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానము కలగలేదు. వేరొక భార్యకి సంతానము కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష ప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడువులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని (గరము అంటే విషం) పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు
అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు. రఘువు పేరు మీద రఘువంశం మొదలయ్యింది.

 రఘువుకి ప్రవృద్ధుడు. ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్టుడు ఆయనని శపించాడు, అప్పుడా రాజు తిరిగి వశిస్టుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కుల గురువుని శపించద్దు అన్నది, కాని అప్పటికే తన కమండలంలోని నీళ్ళు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు, అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు.  

ప్రవృద్ధుడికి శంఖణుడు, శంఖణుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు , అగ్నివర్డుడికి శీఘ్రగురు, శీఘ్రగురుడికి మరువు, మరువుకి ప్రశక్రుడు, ప్రశక్రుడుడికి అంబరీషుడు, అంబరీషుడుడికి నహుషుడు, నహుషడికి యయాతి, యయాతికి నాభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం, ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరములు రాజ్యపాలన చేసి, యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు" అని వశిష్టుడు చెప్పాడు.



ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు:

 "మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి,  నిమికి మిథి. మిథి నిర్మించినదే మిథిలా నగరం, మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్థణుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి శూరుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు.

 మహావీరుడికి సుధృతి, సుధృతికి దుష్టకేతువు, దుష్టకేతువుకి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢుడు , దేవమీఢుడికి విబుధుడు, విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు,
జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది, తరవాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు.

మా త్రండిగారైన హ్రస్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరానికి రాజుగా చేశారు. నా తమ్ముని బాద్యతను నాకు అప్పగించారు.

కొంతకాలం తర్వాత సాంకాశ మహారాజు సుధ్వనుడు నా రాజ్యం మీదకు దండెత్తి వచ్చాడు. నా వద్ద ఉన్న శివధనస్సును నా కుమార్తె సీతను తనకు ఇవ్వమని నాకు వర్తమానం పంపాడు. నేను నా కుమార్తెను కానీ శివధనస్సుని కానీ సుధ్వనుడికి ఇవ్వటానికి నేను ఒప్పుకోలేదు. మా ఇద్దరకీ యుద్ధం జరిగింది.

నేను సుధ్వనుని యుద్దములో ఓడించి వధించాను. సాంకాశ పురమును ఆక్రమించుకున్నాను. తరువాత నా తమ్ముడు కుశధ్వజుని సాంకాశ పురమునకు రాజుగా పట్టాభిషేకం చేశాను


నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చెయ్యమన్నాడు.

నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుని నక్తత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని బుమలు నిర్ణయించారు. దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తిచేసాడు. తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు,  ఒక్కో
కుమారుడితో లక్ష గోవుల్ని దానము చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానము చేశాడు. వశిష్టుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేదిక  సిద్ధం చెయ్యమన్నారు.





                                                       ͢←PREV || NEXT →

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు