ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
దశరథుడు తన పరివారంతో మిథిలా నగరానికి వెళ్లడం
జనకమహారాజు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వారు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి ౩ రోజులు పట్టింది. అక్కడకి చేరుకున్నాక బయట ఉన్న ద్వారపాలకులకు "మిథిలా నగరం నుండి జనకమహారాజు దూతలు వచ్చారని దశరథ మహారాజుకి తెలియజేయండి అని వర్తమానం పంపారు. ఆ వర్తమానం అందుకున్న దశరథుడు వారిని లోపలకి రమ్మన్నాడు. లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వారు జరిగినదంతా చెప్పారు.
మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు.
వెంటనే దశరథుడు తన గురువులతో, పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వారు, "మహానుభావ దశరథ! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు" అన్నారు. వెంటనే
దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదామన్నాడు.
కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనవు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండన్నాడు, రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమన్నాడు, పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని
చేరుకుందామన్నాడు.
మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్తాకువంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన ముగ్గురు పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు. దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వలన నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి, అని లోపలికి రమ్మన్నాడు.
నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి
శివధనుర్భంగం చేశాడు, అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించండి అన్నాడు.
అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు *" అయ్యయ్యో జనకా అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటే కదా వుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, జెదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను" అని అన్నాడు.
ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చిన భరతశత్రుఘ్నులు రామలక్ష్మనులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు.
Comments