ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
భోజరాజు తనకు దొరికిన సింహాసనం చూసి ఇలా అనుకున్నాడు : ఈ సింహాసనం గలచోట మంచె వేసి ఉండడం వలన దానిపైన ఎక్కినప్పుడు బ్రాహ్మణుడికి అలా ఉదార గుణం కలిగి ఉన్నాడు.
పాపం! అతడు ఇక్కడ నిధి ఉంటుంది అని ఎరుగడు అని అక్కడ ఉన్నవాళ్లు ఒకరు ఒకరితో ఒకరు అనుకుంటున్నారు.
అప్పుడు రాజుగారు మంత్రిని చూసి నీతిమంతా చూశావా! నువ్వు చెప్పినట్లే జరిగింది. ఈ సింహాసనాన్ని మనం అంత వైభవం కలిగిన చక్రవర్తి ఎవరో ఆసీనులు అయి వున్నది కానీ సామాన్యులది కాదు. దీని వలన బ్రాహ్మణుడికి ఇలాంటి మంచి గుణము వచ్చింది. ఈ సింహాసనం భూమి లోపల పూడ్పపడి పైన ఉన్న మంచె మీద కూర్చోవడం వలన ఆ బ్రాహ్మణుడికి ఆ విధంగా అంతటి ఔదార్యగుణం కలిగించింది. అంటే దీని ప్రభావం ఎంత గొప్పదో అనడంలో సందేహం లేదు, ఈ సింహాసనం మీద ఆసీనులైన వారికి ఇంకా ఎటువంటి శుభగుణాలు వస్తాయో కదా!
నీతిమంతా! ఇది మన అదృష్టం వలన మనకు లభించింది. దీనిని మన రాజ్యానికి తీసుకువెళ్లి ఉపయోగించాలని నిర్ణయించాను అని చెప్పి, సింహాసనాన్ని జాగ్రత్తగా తీయించి నిపుణులైన పలువురు సేవకులచే మోయించుకొని ధారాపురానికి తీసుకువెళ్లి, తనకు రత్న సింహాసనం లభించినందుకు మన రాజ్యంలో వేడుకలు ఉత్సవాలను జరిపించి, యోగ్యులైన బ్రాహ్మణులను పిలిపించి, మంచి ముహూర్తం నిర్ణయించి, ఆ సింహాసనాన్ని అన్ని విధాలుగా అలంకరించి, ఆ ముహూర్తానికి రాజ్యంలో ప్రతిష్టించాలి. ఆ సమయంలో భోజరాజు అనేక విధముల గో భూహిరణ్య వస్త్ర వాహనాది దానాలు చేశాడు.
భోజరాజు సింహాసనాన్ని అధిరోహించడానికి చాలా ఉత్సాహంతో దాని కొరకు వేరొక శుభలగ్నం ను నిశ్చయించి ఆ సమయం కొరకు వేచి చూస్తున్నాడు.
ఈ ప్రకారంగా భోజరాజు బ్రాహ్మణుడి చేనులో లభించిన రమ్యమైన సాలభంజికలు, రత్నాలు కలిగిన సువర్ణ సింహాసనాన్ని రాజధాని అయిన ధారా నగరానికి తీసుకువచ్చి సభా భవనంలో పెట్టి అది అధిరోహించి ఆసీనులు అవ్వడానికి పెద్దలు నిర్ణయించిన శుభదినాన ఉదయాన్నే లేచి కాల కృత్యాలు ఆచరించి మంగళ స్నానాలు చేసి ఆభరణాలు ధరించి పరిమళ చందన కుసుమాలంకరితుడై భటనట,గాయక, పాఠక, వైణిక,పౌరాణిక, హిత, పురోహిత, మంత్రి, సామంత, దండనాయక, బంధుమిత్రులు, ప్రజలు చూడడానికి వస్తున్న, బ్రాహ్మణోత్తములు ఆశీర్వదించడానికి పూలక్షంతులు తలపై చల్లుచుండగా, మంగళవాద్యాలు వాయిస్తుండగా భటులు పేరు పలుకుతుండగా, ప్రజల జయ ధ్వనులు అన్ని ఏకమై ప్రతిధ్వనమవుతున్నాయి.
అప్పుడు భోజరాజు సభా మండపానికి వచ్చి పరమ ఉత్సాహితుడై ,బ్రాహ్మణులు మంత్ర విధులు అనుసరించి ఆ భవ్యాసనాన్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, అనేక దానధర్మాలు చేసి పెద్దలు అనుమతి తీసుకొని ముహూర్త కాలంలో సింహాసనాన్ని ఆరోహించడానికి ప్రథమ మెట్టుపై పాదం పెట్టాడు.
Comments