ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

భోజరాజు బ్రాహ్మణుడి జొన్న చేనుని కొనడం || Bhojaraju Brahmanudi Jonna Chenuni Konadam || Batti Vikramarka Kathalu

 భోజరాజు బ్రాహ్మణుడి జొన్న చేనుని కొనడం

బ్రాహ్మణుడు బాగా ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలి?  చాలా ఎక్కువ మొత్తంలో ధనం ఇస్తానంటున్నాడు, ఈ పాడు చేనుని ఉంచుకొని నేనేమీ చేయాలి?  ఆ డబ్బును తీసుకొని సుఖంగా జీవింపవచ్చును. ఇది నాకు మంచి అవకాశం అని అనుకుంటున్నాను, అంతే కాకుండా రాజునే చేనుని అడుగుతున్నాడు కదా! 

ఇంత కంటే ఏమైనా లాభం ఉన్నదా?  రాజు కోరి అడిగినప్పుడు తనకు అవసరమయ్యి  నన్ను కనుకరించి  ఇమ్మనప్పుడు దానివలన గొప్ప లాభం కలుగునప్పుడు పెద్దల వలనసంపాదింపబడిన భూమిని అభిమానం కొరకు ఉంచుకొని ఇచ్చుటకు నిరాకరింపవచ్చునా?

ఇప్పుడు రాజు మాటకి ఎదురు చెప్తే రాజుగారు కోపగించుకుని ఈ భూమిని తన అధీనం చేసుకుంటే పిమ్మట నా గతి అధోగతియే అవును

ఇప్పుడు రాజు మాటకి ఎదురు చెప్తే రాజుగారు కోపగించుకుని ఈ భూమిని తన అధీనం చేసుకుంటే పిమ్మట నా గతి అధోగతియే అవును.రాజుగారికి అడ్డు  చెప్పేవారెవరున్నారు అయినా రాజుగారు ఇచ్చే దానిలో గొప్ప లాభం కూడా వచ్చును.  కాబట్టి నేను ఈ భూమి రాజు గారికి ఇచ్చేసి ధనం తీసుకోవడం అన్ని విధాల మంచిదని అనుకుని రాజును చూసి వినయముతో, 

ఓ రాజా! నీ మాటకు అడ్డు చెప్పేది ఎవరు? ఈ చేను కొనుట మీకు సమ్మతమైతే నేను సంతోషముతో ఈ చేనుని మీకు మనస్ఫూర్తిగా ఇస్తున్నాను అని విన్నవించాడు. దానికి భోజ మహారాజు సంతోషించి తన మంత్రిని పిలిచి రాజ్యం చేరాక పదివేల నాణేలు ఇవ్వండి 

అని చెప్పి ఆజ్ఞాపించి,  ఆ బ్రాహ్మణుడిని ధారానగరానికి   వెళ్లమని చెప్పాడు. దానికి ఆ బ్రాహ్మణుడు సంతోషించి ధారా నగరానికి వెళ్లాడు.

ఆ తరువాత రాజుగారు ఆ చేనులో మంచె  అడుగు ప్రదేశమును తవ్వమని సేవకులకు ఆజ్ఞాపించాడు. సేవకులు కొంత లోతు తవ్వగానే అక్కడ దగద్దాయ మానంబై ప్రకాశంతో ఒకటి పొడమికన్నులు మెరిసినట్టు మెరుస్తుంది, అది  ఏమై ఉంటుంది అని అందరూ ఆశ్చర్యంగా

అలాగే చూస్తూ ఉన్నారు. అలాగే ఇంకొంచెం లోతుకి త్రవ్వగా అక్కడ అద్భుతమైన సింహాసనం ఒకటి వారికి కనిపించింది. దానికి గొప్పవైన నవరత్నాలతో  పొదుగుబడి రత్నమయములైన 32 సాలభంజికలు ఉన్న 32 మెట్లు  కలిగిన, బహు రకముల చిత్ర శిల్పకల్పణాలు కలిగి,  సువర్ణ మయమై ఉంది.

జాజ్వల్వమానంబైన కాంతులు నలుదిక్కులు కి ప్రసరిస్తూ ఆ  కాంతులు  సూర్యకిరణాలను అతిక్రమిస్తూ ఉన్నాయి. అటువంటి  ఆ దివ్య తర మనోజ్ఞ సింహాసనాన్ని చూడగానే భోజరాజు చాలా ఆనందంతో అలాగే ఆశ్చర్యంతో అతిశయింపగా దాని అందాన్ని మెచ్చుకుంటూ, ఆహా! చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఈ సింహాసనం ఏ కాలంలో ఏ మహారాజు  అధిరోహించాడో? ఇది ఇక్కడ పూడ్చబడి  ఎలా ఉందో తెలియదు. ఈ అందమైన  దివ్యాసనాన్ని చూడగా దీన్ని ఎక్కిన వాడు భోగభాగ్యాలు కలిగిన  వాడు, ఏక చక్రాధిపతి పరిపాలించిన వాడు అయి ఉంటాడని అనిపిస్తుంది.




                                                                                                                       ← PREV || NEXT →


Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు