ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
బ్రాహ్మణుడు భోజరాజు సేనకు జొన్న కంకులు ఇవ్వటం
భోజరాజు రాజ్యానికి తిరిగి వెళ్లే సమయంలో ఎండ చాలా ఎక్కువగా ఉండడం వలన రాజుగారు వెంట వచ్చిన జనాలు నడవలేక నడుస్తున్నారు. అలా వస్తున్న వారు మార్గమధ్యంలో జొన్న చేనుని ఒక దాన్ని చూశారు. అలాగే ఆ చేను యజమాని అయిన ఒక బ్రాహ్మణుడు చేను మధ్యలో నిర్మింపబడిన ఎత్తైన మంచె మీద నుంచుని జొన్నకంకుల్ని తినడానికి వచ్చిన పక్షుల్ని తోలుతున్నాడు.
ఆ బ్రాహ్మణుడు అప్పుడు సేనతో వస్తున్న భోజరాజు ను చూసి రాజు గారిని పెద్దగా పిలిచి ఇలా అన్నాడు. రాజా! ఇంతటి ఎండలో నీ సేనతో వెళ్లడం సులువు కాదు కదా? మీలాంటి గొప్ప ఉత్తమమైన రాజుకి ఆతిథ్యం ఇవ్వడం మా కర్తవ్యం కనుక ఇక్కడ ఆగండి.
ఇదిగో చూశారా నా జొన్న చేను బాగా పండింది. ఇప్పుడు ఈ గింజలు తినడానికి ఉపయోగపడతాయి. ఇక్కడికి వచ్చి అందరూ తృప్తిగా జొన్న కంకులు పోసి గింజలు దాల్చి తిని కొంచెం సేపు విశ్రమించాక మీరు మీ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించండి.
నా కోరికను మన్నించి వద్దు అని అనకండి. ఇది బ్రాహ్మణుడు సొమ్ము కదా! తీసుకొని అలా తినవచ్చా అని అనుకోకండి. నేను మనస్పూర్తిగానే తినమంటున్నాను. దీనివలన మీకు పాపం తగలదు అని రాజును ప్రార్థించాడు.
అలా చెప్పిన బ్రాహ్మణుడు ప్రార్థన విని రాజు తన సేనకు జొన్న కంకులను తినటానికి ఒప్పుకున్నాడు. వారు వెంటనే చేనులోకి దిగి జొన్న కంకుల్ని దాల్చి ఇష్టముగా జొన్నలు తినుచున్నారు. కొంత సమయం వరకు బ్రాహ్మణుడు మహా సంతోషంతో వారు జొన్నలను తినడం మంచె మీద నుండి చూస్తున్నాడు. కొంత సమయం తర్వాత బ్రాహ్మణుడు మంచె మీద నుండి కిందకు దిగాడు. అప్పటికి రాజుతో వచ్చిన జనులంతా జొన్న కంకులను కోయడం ఆపలేదు. ఇంచుమించు చేనులోనే అన్ని జొన్న కంకులను తిన్నారు.
క్రిందకు వచ్చిన బ్రాహ్మణుడు తన చేను అంతా పాడైపోవడం చూసి కోపంతో మరియు బాధతో తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ భోజరాజుకి ఎదురుగా నిలిచి అయ్యోయ్యో? ఇలాంటి ప్రవర్తన ఎందులో అయినా ఉందా? అన్యాయం అన్యాయం! రాజా! నేరము చేసినవానికి శిక్షించే పదవిలో ఉండి నీవే ఇలాంటి పని చేసి నువ్వు ఎలాగ ధర్మ స్వరూపడవు అని పేరు పొందావు. ఇలాంటి పనులు చేస్తే నీ ప్రతిష్టను పాడుచేస్తాయి కదా! నేను చాలా పేదవాడిని చాలా కష్టాల్లో ఉండి కూడా ఎలాగో కష్టపడి చిన్న పంట వేసి పెంచాను.
దీనివలన కొంతకాలం గడుస్తుంది అని సంతోషించాను. నా ఆశలన్నీ అడుగంట చేశావు. చేను ఎలా పాడు చేశారో చూడు? రాజు అయి ఉండి కూడా నీవు ఇలాగే చేయించవచ్చా? ఇక నేను నా కుటుంబం జీవించేది ఎలా అని ఆవేశంతో అన్నాడు.
అతని మాటలు భోజరాజుకి వింతగా ఉన్నాయి. అరె! దారిలో వెళ్తున్న వారిని ఇతడు తనకు తానే పిలిచి జొన్నలు తినమని ప్రార్థించాడు కదా? ఇందులో నా వలన కలిగిన నేరమేమిటి? ఇంతలో ఇతని ప్రవర్తన ఇలా మారిపోవడానికి కారణమేమిటి? అక్రమముగా ఇతను చేను పాడు చేశాడు అంటున్నాడు. అలా ఆలోచిస్తే ఇతడు పిచ్చివాడిలా ఉన్నాడని రాజు తన మనసులో తాను అనుకున్నాడు.
ఏమైనా కానీ ఇతడు బాధపడడం దేనికి? నా సేన వలన ఇతడు కలిగిన నష్టానికి ఏదైనా పరిహారం చేసే సంతోషపడేలా చేస్తాను అని అనుకోని చేలో కంకులు తింటున్నా వారిని బయటికి రండి అని ఆజ్ఞాపించాడు. మొత్తం బయటికి వచ్చారు. ఇంతలో బ్రాహ్మణుడు మళ్లీ మంచె మీదకి ఎక్కాడు.
ఓ అయ్యలారా! ఎందుకు వెళ్తున్నారు? మీ కడుపు నిండిందా? చాలకపోతే మరికొన్ని జొన్నలను కోసుకొని తినండి లేకపోతే నేను బాధపడతాను అని ఆలోచించకండి. పరులకు ఉపకారం చేయని జన్మ ఏమి జన్మ! అని నా ప్రార్థన అంగీకరించి ఇంకొన్ని జొన్నకంకులని తినండి అని అన్నాడు. ఇంకా కావాల్సినన్ని తుంచి మీ వెంట తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఓ భోజరాజా ఇంకొంచెం జొన్నలను తినడానికి సమయం ఇవ్వు తొందర పెట్టుకొని ప్రార్థించాడు.
రాజు ఇతని చర్యలు చూసి ఆశ్చర్యపడి ఈ లక్షణాలు వెర్రివాడివా? లేక వివేకవంతుడివా? అని తెలుసుకొనుటకు సేనను తిరిగి చేనులోకి పంపాడు.
మంచె పై కూర్చున్నంతసేపు బ్రాహ్మణుడు సంతోషంతో తినండి, మంచి కంకులను చూసి తినండి అని అంటున్నాడు. దేనికో కిందకి మరలా కిందకు దిగగానే తిరిగి అయ్యో పరమేశ్వరా! దేశాధిపతి అయిన రాజే నిరుపేద అయిన నా యొక్క జీవనాధారణమైన చేనును పాడు చేయిస్తున్నాడు. ఇది నీతిమంతుడు లక్షణమా? దీని గురించి ఎవరికీ చెప్పుకోవాలి. నన్ను కనుకరించి న్యాయాన్ని విచారించే పుణ్యాత్ములు ఎవరు?
ఓ రాజా నువ్వు ఎంతటి గొప్పవాడైనా ఇప్పుడు నువ్వు చేయిస్తున్న పని చాలా అక్రమమైనది. నీకు నేను ఎం అన్యాయం చేశాను? నేను చేసిన తప్పేమిటి? నా చేను ఎందుకు ఇలా పాడు చేయిస్తున్నావు. ఈ అధర్మ ప్రవర్తన చూసి దేవుడు మెచ్చుకుంటాడా? నీకు ఇది మంచి పనేనా?
తినబోయే వాడి ముందు విస్తరాకు తీసేసిన విధంగా పంట చేతికొచ్చే సమయంలో నాశనం చేయించావు. దీనికి కారణం తెలియట్లేదు అని ఆగ్రహించాడు.
అప్పుడు భోజరాజు కు చాలా ఆశ్చర్యం కలిగి తన దగ్గరలో ఉన్న మహా బుద్ధిశాలి అయిన తన మంత్రి నీతిమంతుడిని చూసి ఈ బ్రాహ్మణుడి మాటలు చాలా వింతగా ఉన్నాయి కదా! మంచెపై ఎక్కినప్పుడు వినయంతో చేనులోని జొన్నల్ని తినమని ప్రార్థించెను. క్రిందకి దిగినప్పుడు వినడానికి సహింప లేని కర్ణ కఠోరమైన పలుకులు పలుకుతూ తన జొన్న పంట అంతా పాడు చేశామని అంటున్నాడు.
ఇతను ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటో తెలియట్లేదు. మంత్రి గారు మీకు ఏమీ అనిపిస్తుందో ఆలోచించి చెప్పమని అడిగాడు.
తెలివిగల ఆ మంత్రి బాగా ఆలోచించి రాజుతో మహాప్రభు! బ్రాహ్మణుడు ఈ విధంగా ప్రవర్తించడానికి ఆ మంచెయే కారణమని అనిపిస్తుంది. మంచె పైనుంచి దిగేదాని మహిమ తోలుగుట వలన సామాన్య లక్షణాలు కలవాడిలా మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణుడు ఎక్కడ మంచెను కట్టాడో ఆ స్థలములో ఏదో మహిమ ఉన్నది. పరీక్షించకుండా అక్కడ ఏమి ఉందో చెప్పడం సాధ్యం కాని పని, అక్కడ ఏమి ఉందో తెలుసుకోవాలంటే ఆ స్థలాన్ని తవ్వి చూడవలెను లేకపోతే మనకు ఉన్న అనుమానాలు తొలగవు అని చెప్పాడు.
భోజరాజు కూడా మంత్రి చెప్పిందే నచ్చింది. ఏదో ఒక ప్రభావం లేకపోతే ఇతనికి ఇలా వేరుగా ప్రవర్తించడు. దీనికి గల కారణం తెలుసుకోవడం మనకు చాలా అవసరం.
బ్రాహ్మణుని సంతోషపెట్టి ఈ స్థలాన్ని కొని తర్వాత పరీక్షిద్దాము అనుకోని ఆ బ్రాహ్మణుని పిలిచాడు.
ఓ బ్రాహ్మణోత్తమా! అక్రమమైన సక్రమమైన నీ జొన్న చేను అంతా పాడైంది, నీవే కదా పిలిచిన వాడవు? సరే జరగాల్సిందేదో జరిగిపోయింది.ఇప్పుడు బాధపడిన లాభమేంటి? నేను ఒక మాట చెప్తాను విను, అది ఏమిటంటే ఈ చేనంతా నా మనుషుల వల్ల పాడైంది కనుక ఈ చేనును నాకు ఇచ్చి వేసేయి. దీనికి బదులుగా నీకు కొంచెం ధనాన్ని ఇస్తాను. ఆ ధనంతో నీవు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవించవచ్చు, అంతేకాకుండా ఇలాంటి చేనులను ఎన్నో కొనవచ్చును.
ఈ చేను వల్ల నీవు పొందే లాభం చాలా చిన్నది. నీ మేలు ఎంచి ఇలా చెప్తున్నాను అన్యాయము అనుకోకుండా తీసుకో అని చెప్పాడు. ఏమిటి ఒప్పుకుంటున్నావా! ఈ ధనము తీసుకొని భూమిని మాకు ఇచ్చివేయి, నీ అభిప్రాయం ఏమిటో త్వరగా చెప్పు అని అడిగాడు.
← PREV || NEXT →
Comments