ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

శివధనుర్బంగం || Shivadhanurbhangam || Ramayanam ||రామాయణం

 శివధనుర్బంగం 

శివ ధనుస్సు ఉన్న పెట్టెను తీసుకు వచ్చాక విశ్వామిత్రుడు రాముని వంక చూచాడు. “రామా! ఈ ధనుస్సును చూడు” అన్నాడు.

విశ్వామిత్రుని మాటలను విన్న రాముడు “అలాగే మహాత్మా!  తమరు చెప్పినట్టు నేను ఆ ధనుస్సు ఉన్న పేటికను తెరిచి ఆ ధనుస్సును చూస్తాను, తాకుతాను. ఆ ధనుస్సును ఎత్తడానికి, నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను” అని అన్నాడు.

అంగీకార సూచకంగా విశ్వామిత్రుడు తల ఊపాడు. రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు. దానిని నిలబెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు ఆ ధనుస్సును ఏ మాత్రం శ్రమపడకుండా ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని పట్టుకొని తన చెవి దాకా లాగాడు. ఆ ధనుస్సు వంగి "ఫెడేల్‌"  మని మధ్యకు విరిగిపోయి రెండు ముక్కలు అయింది.

ఆ ధనుస్సు విరిగినపుడు పిడుగు పడ్డట్టు భయంకర మైన శబ్దం వచ్చింది. భూమి కంపించినట్టయింది. ఆ శబ్దానికి జనకుడు, రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు తప్ప  అక్కడ ఉన్న వారంతా కిందపడి మూర్ఛపోయారు. ఇదంతా తనకు ముందే తెలును అన్నట్టు విశ్వామిత్రుడు చూస్తున్నాడు.

తరువాత జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! దశరథుని కుమారుడైన శ్రీరాముని వీరత్వమును బలపరాక్రమములను ప్రత్యక్షంగా చూచాను. నా దేహం గగుర్పొడిచింది. మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇది కలా నిజమా అని నమ్మలేకున్నాను. ఇది అతృద్భుతము, ఊహాతీతము. అనుకున్న ప్రకారము నా కుమార్తె సీత,దశరథపుత్రుడు రాముని వివాహమాడి మా వంశమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలదు అని విశ్వసిస్తున్నాను. సీతను “వీరశుల్క” గా అనగా సీతను వివాహమాడుటకు వీరత్వమునే శుల్కముగా నిర్ణయించాను. ఆ వీరత్వము రాముని వద్ద ఉన్నది అని గ్రహించాను. నా ప్రాణసమానమైన నా కుమార్తె సీతను రామునికి మనస్ఫూర్తిగా
సమర్చిస్తాను.

ఓ విశ్వామిత్ర మహర్షీ! తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు పోయి, రామలక్ష్మణులు తమరి సంరక్షణలో సుఖంగా ఉన్నారని తెలిపి, రాముడు శివధనుర్బంగం చేయడం, నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం చేయ సంకల్చించడం మొదలగు విషయములన్నిటి గురించి దశరథ మహారాజుకు వివరంగా చెప్పి, దశరథ మహారాజును బంధుమిత్ర సపరివార సమేతము గా మిథిలకు తీసుకుని రాగలరు అని వినయంగా పలికాడు.

అలాగే కానిమ్ము అని విశ్వామిత్రుడు జనక మహారాజుకు అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే జనక మహారాజు తన మంత్రులతో సంప్రదించాడు.
అయోధ్యకు వెళ్లి దశరధమహారాజుకు జరిగిన విషయములు అన్నీ చెప్పి వారిని సగౌరవంగా మిథిలకు తీసుకొని వచ్చుటకు మంత్రులను పంపించాడు.




                                                                                    Prev || Next 

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు