ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
పావురం-చీమ
ఒక రోజున అడవిలోని చిన్న చెరువులో ఒక చీమ పడిపోయింది.
పాపం! దానికి ఈతరాదు. ప్రాణాల్ని కాపాడుకోవాలని ఎంతో తాపత్రయపడుతోంది.
ప్రక్కనే చెట్టుపై కూర్చొని ఉన్నా పావురానికి ఆ చీమ కన్పించింది. చీమ
పరిస్థితిని చూసి దానికి జాలివేసింది. వెంటనే ఒక ఆకును త్రెంచి చీమకు దగ్గరగా.
నీటిలో వేసింది. చీమ దాని పైకి ఎక్కి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది.
ఒక రోజున చీమ అక్కడి పచ్చగడ్డిలో తిరుగాడుతూ, చెట్టు పైన కూర్చొన్న
పావురాన్ని చూచి దాన్ని పలకరిద్దాము అనుకొంటుంది. ఇంతలో, దగ్గరలోనే
ఒక మనిషి తుపాకితో నిల్చుని ఉండడం చూసింది. అతడు పావురాన్ని
చంపడానికి తుపాకి గురి పెడుతున్నాడు. చీమ, పావురాన్ని ఎలాగైనా
రక్షించాలనుకొంది. అది వెంటనే వేటగాడి కాలుమీద పుటుక్కున కుట్టింది.
ఆ బాధతో “అమ్మో!” అని అరచి, తుపాకిని ప్రక్కన పడేసి వేటగాడు తన కాలును
చూచుకొన సాగాడు. వాడి అరుపుకు హడలిపోయిన పావురం ఎగిరిపోయింది.
ఇలా చీమ, పావురాన్ని రక్షించి దానికి ప్రత్యుపకారం చేసింది.
నీతి:- ఆపదలో ఆదుకొన్నవాడే నిజమైన మిత్రుడు
Comments