ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Neeti Kathalu || Moral Stories || Cheviti Maalokam || చెవిటి మాలోకం

 


చెవిటి మాలోకం


శంకరయ్య చాలా అదృష్టవంతుడు. అతనికి చాల చక్కని అమ్మాయి భార్యగా.

లభించింది.


పెండ్లి అయిన తర్వాత కొన్నాళ్లకు అతనికి వినికిడి కొంచెం తగ్గింది.

అది అంతటితో ఆగలేదు. క్రమేపీ వినికిడి సమస్య పెరుగుతు వచ్చింది.

చివరకు బ్రహ్మచెముడుగా మారింది. రోజులు గడచినకొద్దీ అతనికి ప్రజలతో 

సంబంధంలేకుండా పోయింది. అందరూ “చెవిటిమాలోకం! నీతో మాకు పనేమిటి” అనేవారు.


ఒకరోజున అతని అత్తవారింటి నుండి వాళ్ళ మామగారి ఆరోగ్యం బాగోలేదు  అని కబురు వచ్చింది. 

మామగారిని చూడటానికి వెళ్ళకుంటే "లోకులు కాకుల్లాగ" పొడుస్తారు, మాటలంటారు. 

పైగా నాకు గర్వమని అంటారు. అందుచేత తప్పకుండా వెళ్లి ఆయన్ని చూసి రావాలి.” అనుకొన్నాడు. 

కానీ తనకు ఉన్నా చెవుడుతో పెద్దకష్టమొచ్చి పడిందే! “దీంతో ఎలా నెగ్గుకురావాలి? ఏంచేయాలి?” 

అని పదేపదే ఆలోచించి సాధారణ కుశలప్రశ్చలను కొన్నింటిని వ్రాసుకొని, 

వాటికి ఏయే జవాబులు వస్తాయో కూడా వ్రాసుకొని అనేక మార్లు

వాటిని చదివి పదే పదే చదువుకున్నాడు.


మొదటిప్రశ్న _ :- ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలావుందీ?'


జవాబు - ఇప్పుడు కొంచెం బాగుగానే ఉంది.


తాను అనవలసినమాట _ :-నాకిప్పుడు చాల సంతోషంగా ఉంది.


రెండవప్రశ్న _ :- మీరు ఇప్పుడే మందు వాడుతున్నారు?


జవాబు వా. (ఏదో మందు పేరు)


తాను అనవలసినమాట _ :-బాగుంది! అదే మీకు తగిన మందు.


మూడవప్రశ్న _ :- మీకు వైద్యం ఎవరుచేస్తున్నారు?


జవాబు - (ఏదో డాక్టరుపేరు)


అప్పుడు తనుచెప్ప వలసినమాట :- ఆయనే మీకు తగిన మంచిడాక్టరు.

ఆయనకే అన్నీవదిలేయండి. ఆయనే మీ రోగాన్నితగ్గేలా చేస్తారు. ఇలా

 ఊహించుకొన్నాడు శంకరయ్య.


“ఇంకేం ఫరవాలేదు. అందరూ మెచ్చేలాగ మాట్లాడతాను.” అనుకొని

వెంటనే బయలుదేరి అత్తవారింటికి చేరుకొన్నాడు. వెళ్ళినవెంటనే మామగార్ని

“మీ ఆరోగ్యం ఇప్పుడెలావుంది?” అని అడిగాడు. అందుకు ఆయన “ఇప్పుడేమీ

బాగాలేదు” అన్నాడు. తాను అనుకొన్న జవాబు వచ్చింది అనుకొని శంకరయ్య.

“నాకు యిప్పుడు చాలసంతోషంగా ఉంది” అన్నాడు. ఇతని మాటలు విన్న

మామగారు అవాక్కయ్యాడు.


శంకరయ్య మళ్ళీ“ఇవ్వుడేమందు తీనుకొంటున్నారు”? అని

అడిగాడు.ఆయన కోపంగా “విషం” అన్నాడు. తాను ఊహించిన జవాబే వచ్చి

ఉంటుందనుకొన్న శంకరయ్య “మీకు ఆ మందే బాగా పనిచేస్తుంది” అన్నాడు.

మళ్ళీ “మీకిప్పుడు ఏడాక్టరుగారు వైద్యం చేస్తున్నారు?” అని మామగార్ని

అడిగాడు. అప్పటికే ఇతని దోరణికి విసుగుచెందిన మామగారు కోపంతో

ఊగిపోతూ “యమధర్మరాజు” అన్నాడు. అదికూడా తను ఊహించిన జవాబే

అనుకొన్న శంకరయ్య “ఆయనే మంచి డాక్టరు. మీ బాధలన్నీ ఆయనకే

వదిలెయ్యండి. ఆయనేమీ రోగాన్నితగ్గేలా చేస్తారు.” అన్నాడు.


మామగారికి కోపం ముంచుకొచ్చి చిర్రెత్తుకొచ్చింది. ఒక్క ఉదుటున

వెళ్ళి శంకరయ్యను పట్టుకొని ఒక తోపుతో బయటకు గెంటి 

“ఛీ! ఇకపై నీముఖం నాకు చూపవద్దు,ఫో! అన్నాడు.


నీతి:- జరుగబోయేదాన్ని అతిగా ఊహించకూడదు



                                                                                   ←Prev || Next→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు