ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
మాండ్యవుడు
మాండవ్యుడు ఒక బ్రాహ్మణ తపస్వి. సత్య, ధర్మములను ఆయన బహునిష్టతో ఆచరించేవాడు. మౌన వ్రతంతో ఆయన తన ఆశ్రమ సమీపంలోగల ఆక ఒకచెట్టు నీడన శీర్షాసనంతో తపస్సు ప్రారంభించాడు. అలా కొన్నిసంవత్సరాలు నిశ్చలంగా ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్న కాలంలో ఒకనాడు కొందరు దొంగలు ఆ ఆశ్రమ ప్రాంతానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. రాజభటులు వారిని తరుముకుంటూ వస్తున్నారు. ఆ దొంగలకు ఏమి చేయాలో తోచలేదు. వారి వద్దనున్న దొంగిలింపబడిన వస్తువుల భారంతో వేగంగా పారిపోలేక ఆ వస్తువులను మాండవ్యుని ఆశ్రమంలో దాచి పారిపోయారు.
రాజభటులు తర్వాత అచ్చటకు చేరారు, దొంగలు ఆశ్రమంలో దాగి యుంటారని భావించి ఆ ఆశ్రమాన్ని వెదికారు. అక్కడ ఆ చోరులు దాచిన వస్తువులు కనిపించినవి. బయట వెతికారు. కొద్ది దూరంలో శీర్షాసనంతో తపస్సు చేస్తున్న మహర్షి కనిపించాడు. ఒక దొంగ తమను మోసం చేయడానికే ఈ విధంగా తపస్వీవలె నటిస్తున్నాడని భావించారు. వెంటనే ఆ దొంగల జాడ చెప్పమని గద్దించి అడిగారు. మౌన వ్రతంలో ఉన్న ముని మాట్లాడలేదు.
వారు పిదప దొంగలనందరనూ బంధించి వారితో మునిని కూడ బంధించి తీసుకువెళ్ళారు. అందరినీ రాజు సమక్షంలో నిలబెట్టారు. ఆ చక్రవర్తి చోర నేరానికి వారందరకు మరణదండన విధించాడు. అందరితోపాటు మహర్షిని కూడా ఆ రాజభటులు ఒక శూలానికి గుచ్చారు. దొంగలందరూ మరణించారు. కానీ ఆ ధర్మాత్ముడు మాత్రం ఆ శూలాగ్ర భాగంలో ఆహార పానీయాలు లేకుండా చాలా కాలం తన తపశ్శక్తివల్ల జీవించి ఉన్నాడు. అలా ఉంటూ మాండవ్యుడు తన తపోబలంతో ఇతర బుషులను పిలువసాగాడు. ఆ బుషులందరూ మాండవ్యుని పిలుపు నందుకుని పక్షి రూపాలలో రాత్రిపూట వచ్చి ఆ మహాత్మునికి కల్గిన దుస్థితికి విచారించి “మహర్షీ! ఏ కారణం చేత నీకీ దుస్ధితి కల్లినది?”” అని ప్రశ్నించారు. ఆ ధర్మశీలి తన ప్రారబ్ధమునకు మరొకరపై నిందారోపణ చేయదల్బుకోలేదు, శిక్ష వేసినా మహర్షి మరణించకపోవడం, రాత్రిపూట పక్షులు వానితో సంభాషించడం రాజభటులకు ఆశ్చర్యం వేసింది. వార్పు వెంటనే చక్రవర్తికి ఈ విషయం తెలియటేశారు.
ఆ రాజు వెంటనే వచ్చి మహర్షికి క్షమాపణ చెప్పుకుని అనుగ్రహించమని పదే పదే ప్రార్థించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు ఆయన శరీరం నుండి శూలాన్ని బయటకు లాగబోయారు. కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు మాండవ్యుడే ఆ శూలాగ్ర భాగాన్ని తన శరీరంలో ఉంచుకొని మిగిలిన భాగాన్ని నరికివేశాడు. శూలా(గ్ర భాగాన్ని “అణి” అని పిలుస్తారు. అణీ శరీరమందు కలవాడు కొన ఆయన అణి మాండవ్యడు అంటారు.
శరీరంలో శూలమున్నా ఆయన తపస్సుతో అనేక పుణ్యలోకాలను సంపాదించాడు. ఒకనాడు మాండవ్యుడు యమలోకం వెళ్ళాడు. దివ్య సింహాసనంపై కూర్చుని ఉన్న యమధర్మరాజును చూచి “యమధర్మరాజా! నాకు ఊహ తెల్సిన తర్వాత నేను ఏ పాపం చేయలేదు. అజ్ఞాన దశలో చేసిన ఏ పాపానికి నాకు శిక్ష వేశారో ప చెప్పమని కోరాడు. అంత యమధర్మరాజు మహర్షీ మీరు బాల్యంలో తూనీగలను పట్టుకుని వాటికి ముళ్ళు గుచ్చి ఆటలతో ఆనందించేవారు. దాని వల్ల మీకు ఈ స్థితి కల్గిందని చెప్పాడు.
చూడండి! అల్ప దానం మహా ఫలాన్షిచ్చినట్లే స్వల్ప పాపం కూడ అత్యంత కష్టాలనిస్తుంది గదా!
Comments