ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
ఒక రోజున గోవిందుకి వాళ్ల నాన్న ఒక చిన్న వెండి పెట్టెను ఇచ్చి
“గోవిందా! ఈ పెట్టెను తీసుకొనివెళ్లి ప్రక్క ఊరిలోనున్న మీ మామయ్యకు
యిచ్చి తిరిగి త్వరగా వచ్చేయ్! నీవు పెందరాళే బయలుదేరివెళ్తే
మళ్లీ పొద్దు పోయేలోపు యింటికి రావచ్చు!” అని చెప్పాడు.
గోవిందు వెంటనే బయలుదేరి 2 గంటల్లో వాళ్ల మామయ్య గారింటికి
చేరుకొన్నాడు. వాళ్ల మామయ్యకు ఆపెట్టెను యిచ్చివేశాడు. వాళ్ల అత్తయ్య
గోవిందుకు పిండివంటలతో చక్కటి భోజనం పెట్టింది. కొంతసేపైన తర్వాత
వాళ్ల మామయ్య వచ్చి “నేను పెట్టెలోని వస్తువుల్ని తీసుకొన్నాను. ఇంక
నీవీపెట్టెను తిరిగి తీసుకొని వెళ్లవచ్చును .” అని గోవిందుకు
ఆ వెండి పెట్టెను యిచ్చి “బాబూ! జాగ్రత్తగా వెళ్లు .
దారిలో టక్కరిదొంగలుంటారు.” అని చెప్పి గోవిందుని సాగనంపాడు.
కొంతదూరం వెళ్లిన తర్వాత ఎవరో దొంగ తన వెనకే వస్తున్నట్లు
గోవిందుకు అనుమానం వచ్చింది. ఏం చేయాలో తోచక
పరుగులంకించుకొన్నాడు. ఆ దొంగ కూడా పరుగెత్తడం మొదలుపెట్టాడు.
దార్లో ఒక నుయ్యి కన్పించింది. కొంచెం కొంచెం నీళ్లు త్రాగి వెళదామని నూతి దగ్గరకు వెళ్లాడు .
దొంగ అంతకంతకూ దగ్గరగా వస్తున్నాడు. వెంటనే గోవిందుకు మెరుపులాంటి
ఆలోచన ఒకటి తట్టింది. పెద్దగా అరుస్తూ “అమ్మోయ్! బాబోయ్! నేనిప్పుడు
ఏంచేసేదిరా దేవుడోయ్!” అని కేకలు వేయడం మొదలెట్టాడు.
అప్పుడా దొంగ దగ్గరగావచ్చి “ఏంబాబూ! ఎందుకేడుస్తున్నావు?” అన్నాడు.
వెంటనే గోవిందు “నేను నీళ్లు తోడుతుంటే నాచేతి గొలుసు, ఉంగరం,
వాచీ నూతిలో పడిపోయాయి. అవి లేకుండా యింటికి ఎట్లా వెళ్లాలి ?” అన్నాడు.
“వెండిపెట్టె కంటే అవే మేలు. బంగారు గొలుసు, ఉంగరం, వాచీ-వాటిని
అమ్ముకొంటే బోలెడంత డబ్బువస్తుంది” అని అనుకొన్నాడు దొంగ.
“బాబూ! నువ్వు ఇక్కడే ఉండు. నేను నీ వస్తువులను పైకితెస్తాను” అని,
వెంటనే దొంగ నూతిలోనికి ఉరికాడు.
నా ఆలోచన ఫలించింది! ఇప్పుడు నేను వెండి పెట్టెతో క్షేమంగా
యింటికి పోవచ్చును” అనుకొని పరుగెత్తుకొంటూ యిల్లు చేరాడు గోవిందు.
"నీతి:- తెలివితో ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు"
Comments