ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Ramayanam || Viswamithrudu Trishankudini Swarganiki Ela Pampinchadu?

విశ్వామిత్రుడు త్రిశంకుడిని స్వర్గానికి ఎలా పంపించాడు?

విశ్వామిత్రుడు త్రిశంకుడికి ఇచ్చిన మాట ప్రకారం తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరగండి, వశిష్ఠుడు చెయ్యలేని యాగము విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషులను తీసుకురండి. విశ్వామిత్రుడు ఆజ్ఞమేరకు ఆయన శిష్యులు, కొడుకులు అందరు నలు దిక్కులకి వెళ్లి బ్రాహ్మణులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. అందరు విశ్వామిత్రుడికి భయపడి వచ్చారు. తరువాత విశ్వామిత్రుడి కొడుకులు వచ్చి వశిష్ట మహర్షి కుమారులు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు ఈ యాగానికి రానన్నారు అని విశ్వామిత్రుడితో చెప్పాడు. అలాగే వారు ఇలా అన్నారు "అది ఏమిటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక ఛండాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చు అని వేదాలలో ఎక్కడా లేదు", అందుకని రానన్నారు అని వారు అన్న మాటలు విశ్వామిత్రుడితో చెప్పారు. 


ఆ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చి వశిష్ట మహర్షి కొడుకులని, మహోదయుడిని మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళతారు. ఆ తరువాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు, ఆ తరువాత ముష్టికులన్న పేరుతో పుట్టి, కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు అలాగే మహోదయుడు సర్వలోకాలలోని జనాల చేత ద్వేషింపపడి నిషాదుడై బతుకుతాడని వారిని శపించాడు . 


తరువాత అందరు కలిసి యాగముని మొదలుపెట్టారు. యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవతలు రాలేదు. దానితో విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. తరువాత త్రిశంకుని చూసి ఇలా అన్నాడు:" ఓ త్రిశంకు! నా తపః ప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరముతో స్వర్గానికి పంపిస్తాను. ఇప్పటిదాకా సశరీరంగా  ఎవరు వెళ్లలేని స్వర్గానికి నీవు వెళుతున్నావు. నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను. వెళ్లు, ఈ శరీరముతో స్వర్గానికి వెళ్లు అని అన్నాడు. 


విశ్వామిత్రుని తపః శక్తితో త్రిశంకుడిని పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి త్రిశంకా! నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోకం ప్రవేశం లేదు అని తలక్రిందులుగా కిందకి పో అని శపించాడు.  అలా త్రిశంకుడు తలక్రిందులుగా కిందకి పడిపోతు అయన విశ్వామిత్రుడిని ప్రార్థించగా, విశ్వామిత్రుడు తన మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని, సప్తర్షులను సృష్టించాడు.  కానీ దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి, దేవతలను కూడా సృష్టిద్దామని అనుకుంటూ ఉండగా దేవతలందరు వచ్చారు. 


మహానుభావ! శాంతించు. ఎంత తపః శక్తితో ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తారా?, మీకు శాస్త్రం తెలుసు, ఇతడు మానవుడు, పైగా ఛండాలుడు, సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు అన్నారు. 


దేవతల మాటలతో విశ్వామిత్రుడు శాంతించాడు "మీరు చెప్పినది నిజమే. కాని నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతాను అని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఇతనిని స్వర్గానికి పంపకపోతే నేను ఇచ్చిన మాట తప్పినవాడను అవుతాను కదా! నాకు అసత్య దోషం కలుగుతుంది.  


కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలం శాశ్వతముగా అంతరిక్షంలో ఉండేలా నాకు అనుమతి ఇవ్వండి. ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకుడు శాశ్వతముగా ఉంటాడు అని అన్నాడు. దానికి దేవతలు ఒప్పుకుని ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చారు దేవతలు. దానికి విశ్వామిత్రుడు ఒప్పుకుని సరే అన్నాడు. 


తనకి ఇక్కడ మనఃశాంతి లేదని ప్రశాంతముగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కున ఉన్న పుష్కర క్షేత్రానికి వెళ్లారు.





                                                                                                                                                                                                                      Prev || Next

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు