ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతానని తన భార్యతో కలిసి దక్షిణ దిక్కుకి వెళ్లి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఈ కాలంలోనే విశ్వామిత్రుడికి హవిష్యందుడు, మధుష్యందుడు., దృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు పుట్టారు. విశ్వామిత్రుడు తపస్సు చేయడం మొదలు పెట్టి 1000 సంవత్సరాలు పూర్తి అయ్యింది. విశ్వామిత్రుడి తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా అన్నారు : " నీ తపస్సుకి సంతోషించాను, ఇప్పటినుండి నిన్ను విశ్వామిత్ర మహారాజుగా కాకుండ రాజర్షి విశ్వామిత్రగా పిలుస్తారు" అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు. బహ్మర్షి అయ్యేదాకా తపస్సు చేస్తాను అని మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభిస్తాడు.
అదే కాలములో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న ఇష్టం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలి అన్నా కోరిక పుట్టింది. వెంటనే కులగురువైనా వసిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కానీ, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరముతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. శరీరముతో స్వర్గానికి వెళ్లడం అనేది జరగదు అని వశిష్ఠుడు త్రిశంకుడితో అన్నాడు.
ఆ తరువాత త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాడు. మా తండ్రిగారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరముతో ఎవరు వెళ్ళలేరు, అది జరిగే పని కాదని వశిష్ఠుడి కుమారులు త్రిశంకుడితో అన్నారు.
అప్పుడు త్రిశంకుడు అలా అయితే నేను వేరొక గురువును వెతుక్కుంటాను అని అన్నాడు. నువ్వు నీ గురువు మాట వినలేదు. ఆయన పుత్రులైనా మా మాట వినలేదు. ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు, నీకు ఇలాంటి చెడు బుద్ది పుట్టింది కనుక నువ్వు ఛండాలుడివి అవుతావు అని శపించారు. మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్నీ ఇనుప ఆభరణాలుగా మారిపోయాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా మారిపోయినాయి. ఆయనను చూసి అతని రాజమందిరంలోని బంధువులు, ఇతర మంత్రులు అందరు పారిపోయారు. ఆ రూపంలో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడు దగ్గరకి చేరుకున్నాడు.
అతనిని చూసి విశ్వామిత్రుడు జాలిపడి ఏమి జరిగిందో తెలుసుకున్నాడు. వశిష్ఠుడిని ఎలాగు అస్త్రాలతో ఓడించలేకపోయాను. వశిష్ఠుడు చేయలేనిది విశ్వామిత్రుడు చేసాడు అని లోకం అనుకోవాలని అని విశ్వామిత్రుడు అనుకొని త్రిశంకుడితో ఇలా అన్నాడు. " ఓ త్రిశంకు! బాధపడకు. నీవంటి ధర్మాత్మునికి నేను సహాయం చేస్తాను. నీ చేత యాగం చేయిస్తాను. ఎంతో మంది మహాఋషులను నీవు చేయబోయే యాగానికి ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో అంటే ఛండాలుడి శరీరముతో సహా నిన్ను స్వర్గానికి పంపిస్తాను అని త్రిశంకుడికి మాట ఇస్తాడు.
Comments