ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కున ఉన్న పుష్కర క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగం చేస్తున్నాడు. ఆయన అశ్వమేథ యాగము చేసి గుర్రాన్ని వదిలిపెట్టాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు అశ్వాన్ని తీసుకెళ్లిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. నీవు యజ్ఞపశువుని అంటే అశ్వాన్ని అయినా తీసుకురా లేకపోతే దానికి బదులు ఒక మనిషిని అయినా తీసుకువస్తే యజ్ఞాన్ని పూర్తి చెయ్యవచ్చు అని మహర్షులు చెప్పారు. అది కూడా న్యాయముగా తీసుకు రావాలి అని చెప్పారు.
ఒక మనిషిని తీసుకురావడం కోసం అతను బయలుదేరాడు. అంబరీషుడు వేల కొలదీ ఆవులు ఇస్తాను ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు, కానీ ఎవరూ ఒప్పుకోలేదు. అలా వెళ్తూ భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు.
అంబరీషుడు ఋచీకమహర్షి దగ్గరకు వెళ్లి జరిగినది అంతా వివరించి మీ కుమారులలో ఒకరిని నాకు యజ్ఞ పశువుగా ఇవ్వగలరా?, దానికి బదులుగా నేను లక్ష గోవులను ఇస్తాను అని అడిగాడు.
అప్పుడు ఋచీకుడు ఇలా అన్నాడు: " పెద్దకొడుకు ధర్మ సంతానం ( పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్ట చివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుంది నేను చిన్న వాడిని ఇవ్వటానికి ఒప్పుకోనని ఋచీకుడి భార్య అన్నది".
ఋచీక మహర్షికి ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకుని తండ్రి, చిన్న వాడిని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన శునఃశేపుడు . ఆ శునఃశేపుడు అంబరీషుడితో ఇలా అన్నాడు: " ఓ రాజా! పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు అంటే మధ్యముడనైన నన్ను ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకువెళ్ళండి అని అన్నాడు".
అంబరీషుడు సంతోషముగా లక్ష గోవుల్ని మూల్యముగా ఇచ్చి శునఃశేపుడని యజ్ఞ పశువుగా తన వెంట తీసుకొని వెళ్లారు.
శునఃశేపుడని తీసుకెళుతున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోనికి వెళ్లి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పది ఇలా అన్నాడు : " మీరు నాకు వరుసకు మేనమామ అవుతారు, అలాగే జరిగినది చెప్పి పెద్దవాడిని నాన్నగారు ఇవ్వను అన్నారు, చిన్నవాడిని అమ్మ ఇవ్వను అని అంది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు ఎక్కువ కాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి" అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులను పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానములో యజ్ఞపశువుగా వెళ్ళండి అన్నాడు .
నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకును రక్షిస్తారా, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులు అన్నారు. దానికి విశ్వామిత్రుడికి కోపం వచ్చి మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరములు వాళ్ళలాగా కుక్కమాంసం తింటూ బతకండి అని శపించాడు.
అప్పుడాయన శునఃశేపుడితో నువ్వేమి బెంగపెట్టుకోకు, నిన్ను తీసుకెళ్లి యూప స్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను. నిన్ను అలా స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వలన ఇంద్రుడు సంతోషించి నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడు అని చెప్పి ఆ రెండు మంత్రాలను చెప్పి శునఃశేపుడిని పంపిస్తాడు. తరువాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు. అప్పుడు అతడు విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యజ్ఞపశువుని బాలి ఇవ్వకుండానే మీకు యజ్ఞ ఫలితం ఇస్తున్నాను అని అన్నాడు. అప్పుడు అందరు సంతోషించారు.
Prev || Next
Comments