విశ్వామిత్రుడు రాజు నుంచి మహర్షిగా ఎలా మారాడు?
గాధి కుమారుడైనా విశ్వామిత్రుడు చాలాకాలం రాజ్యపాలన చేసాడు. ఒకనాడు అయన ఒక అక్షౌహిణి సైన్యముతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లారు. వశిష్ట మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి-జింక, ఎలుక-పాము, కుక్క- పిల్లి ఒక దానిని ఒకటి తరమదు, చంపదు. ఆ ఆశ్రమంలో కొన్ని వేలమంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం చాలా అందంగా ఉంది. ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉంది. అది అమృతంతో సమానమైన పాలు ఇస్తూ ఉండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాదులు చేసేవారు. అంత పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట వదిలిపెట్టి ఆశ్రమంలోకి వెళ్లారు.
అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠ మహర్షితో ఇలా అన్నారు. అయ్యా! మీరు ఎలా ఉన్నారు? యజ్ఞయాగాదులు బాగా జరుగుతున్నాయా? మీకు ఎలాంటి కష్టం లేదు కదా అని కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆ ప్రశ్నలకు వశిష్ఠ మహర్షి సంతోషించి నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు. నీ రాజ్యం ఎలా ఉంది? నీవు న్యాయంగా రాజ్యపాలన చేస్తున్నావా? అని వశిష్ఠ మహర్షి కుశల ప్రశ్నలు అడిగి సమాచారం తెలుసుకున్నాక విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో ఇక నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు.
నువ్వు ఈ భూమిని పరిపాలించే రాజువు, నువ్వు నాకు అతిథులతో శ్రేష్ఠుడువి, కనుక నా ఆతిధ్యం స్వీకరించాలి అన్నారు.
మీరు నాకు చేతులు, పాదములు కడుక్కోవడానికి తాగడానికి నీళ్లు ఇచ్చారు. మీరు తినే తేనే, కందమూలాలు నాకు పెట్టారు, అలాగే నాకు మీ దర్శనం అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి, ఇక మీరు శ్రమ తీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు మీరు నా ఆతిధ్యం తీసుకోవాలని వశిష్ఠ మహర్షి అన్నాడు. సరే అని విశ్వామిత్రుడు అంగీకరించాడు.
అప్పుడు వశిష్ట మహర్షి శబళని పిలిచి,చూసావా మన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు వచ్చారు. నువ్వు ఆయనకి మరియు మహారాజ అక్షౌహిణి సైన్యానికి భోజనం ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏమి కావాలో అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబళ ఎవరెవరు మనస్సులో ఏమి తినాలి అనుకుంటున్నారో గ్రహించి చెరుకు కర్రలు, తేనె, పానీయాలు, కొండ అంత ఎత్తున అన్నం రాసులని, కూరలు, పచ్చళ్ళు. పులుసులు, పళ్లరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి అన్నీ తయారుగా ఉంచింది.
శబళ తయారుగా ఉంచిన భోజనాన్ని అందరు తిని చాలా రుచిగా ఉంది అని అనుకున్నారు. ఒక గోవు ఇంతమందికి సరిపడ భోజనాన్ని సృష్టించే సరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకు శబళ మీద వ్యామోహం పెరిగి శబళను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో నేను మీకు లక్ష ఆవులను ఇస్తాను, నాకు ఈ శబళని ఇవ్వండి అన్నాడు.
విశ్వామిత్రుడు ఎలా అయినా శబళని తీసుకోవాలి అనుకుంటున్నాడు అని గ్రహించి వశిష్ట మహర్షి నవ్వి, నేను మీకు శబళను ఇవ్వను అని అన్నారు. దానికి విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఇలా అన్నారు.రాజ్యంలో ఎక్కడున్నా రత్నాలు ఉంటే అవి రాజు దగ్గర ఉండాలి. చాల విలువైనది రత్నమే అయితే ఇంత విలువైన శబళ కూడా రత్నమే. నాది అయినా ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు. అందుకే నేను ఈ రత్నాన్ని తీసుకెళుతున్నాను అని అన్నాడు.
నాయన విశ్వామిత్రా! ఈ ఆవు ఒక రత్నం, దీనిని నీ దగ్గర విలువుగా దాచుకోవాలని అనుకుంటున్నావు కానీ మా ఆశ్రమంలో కావలసినన్నీ పాలు ఇస్తుంది. మా ఆశ్రమంలో యజ్ఞాలు, విద్యాభ్యాసం అన్నీ ఈ శబళ మీద ఆధారపడి ఉంది. కాబట్టి దీనిని నీకు ఇవ్వలేను అని మహర్షి అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు నేను మీకు మెడలో బంగారు తాడులున్నా 14,000 ఏనుగులని ఇస్తాను, 800 బంగారు రథాలు ఇస్తాను. ఆ ఒక్కో రథానికి బంగారు ఆభరణాలతో అలకరించబడ్డ నాలుగు గుర్రాలు ఉంటాయి. అలాగే గొప్ప గొప్ప జాతులకు చెందిన 11,000 గుర్రాలు ఇస్తాను. ఒక కోటి గోవుల్ని ఇస్తాను. బంగారం, వెండి ఎంత కావాలో నువ్వే అడుగు నేను ఇస్తాను అని అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి నేను ఇంకా ఏమి మాట్లాడను అన్నాడు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు ఈయన ఇవ్వడం ఏంటి, నేను తీసుకోవడం ఏంటి? అడిగినకొద్దీ బెట్టు చేస్తున్నావు. ఇది నాకు చెందినది అని శబళ మెడలో తాడు కట్టి సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. దానికి శబళ ఏడ్చింది. ఇంత జరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశబ్దంగా ఉన్నాడు. శబళ బాధపడుతూ నేనైమైనా తప్పు చేశానా? ఎందుకు వశిష్ఠ మహర్షి ఎందుకు వదిలేశాడు అని తాడు విడిపించుకుని వశిష్ఠుడి దగ్గరకి పరుగు తీసింది.
శబళా! నేను నిన్ను విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెళుతున్నాడు. అయన ఈ భూమికి ప్రభువు, కానీ నేడు తప్పుడి మార్గంలో వెళుతున్నాడు. ఇక ఆయన చేసిన తప్పులే ఆయనని శిక్షిస్తుంది అని చెప్పాడు.
అప్పుడు శబళ మహర్షితో నన్ను నేను రక్షించుకోనా అని అడుగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠ మహర్షి చెప్పాడు.
Comments