ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
వశిష్ఠుడు శబళని రక్షించుకోమని చెప్పాక కామధేనువు ఒక్కసారి అంబా అని అన్నది. దానితో చాలా సేనలు సృష్టించబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుడి సేనలను నాశనం చేయడం మొదలుపెట్టాయి.
విశ్వామిత్రుడి కళ్ళ ఎదుట తన సేనలు నాశనం అవ్వడం చూసి అతనే స్వయముగా రథం ఎక్కి కామధేనువు సృష్టించిన సేనలను నాశనం చేశాడు.
కామధేనువు సృష్టించిన సేనలను విశ్వామిత్రుడు నాశనం చేయడంతో కామధేనువుకి కోపం వచ్చి ఇంకా సేనలను సృష్టించింది. ఆ సేనలు మళ్ళీ విశ్వామిత్రుడి సేనలను నాశనం చేశాయి. దానితో విశ్వామిత్రుడు దివ్య అస్త్రాలను ఉపయోగించి కామధేనువు సృష్టించిన సేనలను నాశనం చేసాడు.
కామధేనువు సేనలను విశ్వామిత్రుడు నాశనం చేయడం చూసి వశిష్ఠుడు కామధేనువుతో ఇంకా సేనలను సృష్టించమన్నాడు. అప్పుడు కామధేనువు మరల అంబా అని అరిచింది. అలా అరవడంతో సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజ వీరులు, ప్లవులు, యవనులు, శకులు, మ్లేచ్చులు పుట్టారు. వారందరు కలిసి విశ్వామిత్రుడి సేనని నాశనం చేసారు.
విశ్వామిత్రుడి సేనలు నాశనం కావడం చేత విశ్వామిత్రుడి 100 మంది కుమారులు వశిష్ఠుడి మీదకి వెళ్లారు. వశిష్ఠుడు తనకున్న తపః శక్తులతో వారిని చంపేశారు. తన కుమారులు, సైన్యం నాశనం కావడం కళ్లారా చూసి విశ్వామిత్రుడు చాలా సేపు బాధపడ్డాడు. విశ్వామిత్రుడి శౌర్యము, సాహసము, ఎందుకు పనికిరాకుండా పోయాయి. కొడుకులను పోగొట్టుకున్నా విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షి మాదిరిగా మిగిలిపోయాడు. ఒక కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలుసుకొని అతడికి రాజ్యాభిషేకం చేసి విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు.
Comments