ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Mahadevudaina Shivudu Viswamitrudiki Emi Varam Ichhadu?

 మహాదేవుడైనా శివుడు విశ్వామిత్రుడికి ఏమి వరం ఇచ్చాడు?

విశ్వామిత్రుడు హిమాలయాలకు వెళ్ళి మహాదేవుడైనా శివుడి కోసం తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాలకు విశ్వామిత్రుడి తపస్సుకు సంతోషించి శివుడు విశ్వామిత్రుడి ఎదుట ప్రత్యక్షం అయ్యాడు . 

తరువాత శివుడు విశ్వామిత్రుడితో నీవు ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. 

మహాదేవా! నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందిన వాడివైతే నేను ఎవరి దగ్గరకి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ అంటే దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషలకు తెలిసిన అన్నీ అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసేలా అనుగ్రహించమని శివుడిని కోరాడు. దానికి శివుడు తథాస్తు అన్నాడు. 

పౌర్ణమి రోజు సముద్రం ఎలా పొంగుతుందో, అలాగే విశ్వామిత్రుడు పొంగిన ఆత్మ విశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్తాడు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి వశిష్ట మహర్షి ఆశ్రమాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు. దానితో ఆశ్రమంలోని మునులు అందరు తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్ని చనిపోగా మరి కొన్ని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి. 

"భయపడకండి, నేను విశ్వామిత్రుడిని ఎదిరిస్తాను. మిమ్ముల్ని రక్షిస్తాను" అని వశిష్ఠుడు అరుస్తున్నాడు కాని ఎవరు అతని మాట వినలేదు. అందరు పారిపోయారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం అంతా స్మశానంలా మారిపోయింది. 

విశ్వామిత్రుడు చేసిన మారణకాండ చూసి వశిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు: " ఓ విశ్వామిత్రా! నేను ఎంతో కాలంగా పెంచి పోషించిన జీవాలను, వృద్ధి చేసిన ఆశ్రమాన్ని క్షణకాలంలో నాశనం చేశావు. ఇక నేను నిన్ను నాశనం చేస్తాను" అని తన దండమును చేతిలోకి తీసుకొని విశ్వామిత్రునికి ఎదురుగా నిలబడ్డాడు. 

ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకొని ఉంటే అది ఎలా ఉందంటే సమస్త లోకాలను శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా ఉన్నారు. 

అయినా విశ్వామిత్రుడు లెక్కచేయక వశిష్ఠ మహర్షి మీదకు ఆగ్నేయాస్త్రాన్ని వదిలారు. వశిష్ఠుడి బ్రహ్మదండం ,ముందు ఆగ్నేయాస్త్రం నీటి ముందు అగ్ని మాదిరి శాంతించి వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. దానితో విశ్వామిత్రుడి కోపం పెరిగి వెంటనే వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇషీకాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మపాశం, కాలపాశం, వారుణపాశం, పినాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశులం, కాపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, కంకాళం,ముసలం, పెద్ద పెద్ద గదలు మొదలైన అన్ని రకాల అస్త్రాలు వశిష్ఠుడి మీదకు వదిలాడు. 

విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములను అన్ని వశిష్ఠ మహర్షి బ్రహ్మదండంలోకి వెళ్లిపోయాయి. ఇక విశ్వామిత్రుడి దగ్గర మిగిలింది బ్రహ్మాస్త్రం మాత్రమే. దానిని కూడా వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. 

ఆ బ్రహ్మాస్త్రం వినాశనాన్ని సృష్టించడం ప్రారంభించింది, లోకములన్నీ ఆ బ్రహ్మాస్త్ర శక్తికి మండిపోతున్నాయి, ముల్లోకాలు తల్లడిల్లిపోతున్నాయి. 

దేవతలు, గంధర్వలు అందరు వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి బ్రహ్మాస్త్రాన్ని శాంతింప చేయమని ప్రార్ధించారు. దానితో బ్రహ్మస్త్రం కూడా వశిష్ఠ మహర్షి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. 

ఇంత చేసిన విశ్వామిత్రుడికి భంగపాటు కలిగింది. అవమానభారంతో కృంగిపోయాడు. క్షత్రియ బలం కన్నా బ్రహ్మా తేజస్సు గొప్పదని తెలుసుకున్నాడు. 

వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేను బ్రహ్మర్షి అవుతాను అని విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. 





                                                                                                                            Prev  Next

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు