ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

అయోధ్య నగర వర్ణణ

                         అయోధ్య నగర వర్ణణ


సూర్యవంశపు రాజులు  అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలించారు. 

అయితే అయోధ్య నగరాన్ని ఎవరు పరిపాలించారో  తెలుసా మీకు!

అయోధ్య వైవస్వత మనువు  స్వయంగా నిర్మించారు. 

మొత్తం అయోధ్య నగరం ఎలా ఉంటుందో తెలుసా మీకు !

అయోధ్య నగరం పన్నెండు ఆమడల పొడవు, మూడు ఆమడల వెడల్పు గల చక్కని నగరం. 

ఆమడ అంటే ఏంటో తెలుసా ఆమడని యోజన అని కూడా అంటారు.

ఒక యోజన అంటే  9.09 మైళ్లు లేకపోతే 14 కిలోమీటర్లు.

అయోధ్య నగరం చుట్టూ ప్రాకారం లోతైన అగడ్తలు( అగడ్తలు అంటే లోయలు)ఉండేవి.

నగరంలో లక్ష్మీ తాండవించేది.

నగరంలో శిల్పులు,కళాకారులు,పండితులు మరియు యుద్ధ విద్యలో ఆరితేరిన వారు  ఉండే వారు.

 వెేదాలు  తెలిసినవారు , పట్టణంలో ఏనుగులు,గుర్రాలు ,గోవులు,ఒంటెలు, గాడిదలు ఉండేవి.
ప్రజల జీవితం చాలా సుఖమయంగా వుండేది.

అయోధ్య  నగరంలో సంగీత వాద్యకచేరీలు ఎప్పుడూ జరుగుతూ ఉండేవి.

ఆ నగరంలో ఎంతోమంది యోధులు వీరులూ వుండేవారు.

వారు విలువిద్యలో సిద్ధహస్తులు  , శబ్దవేది విద్యలో ప్రావీణ్యం సంపాదించేవారు.
శబ్దవేది అంటే లక్ష్యం చూడకుండా కేవలం ఆ లక్ష్యం నుంచి వచ్చే శబ్దం విని ఆ లక్ష్యాన్ని కొట్టడం.

అక్కడ ఇంకా మానవులకు హానిచేయు క్రూరమృగములను ఆయుధములను ఉపయోగించి కానీ ఆయుధములు లేకుండా  వట్టి చేతులతో చంపగలిగిన బల పరాక్రమం కలిగినవారు అయోధ్యలో ఉండేవారు.

అటువంటి సమన్విత మహానగరమే అయోధ్య.  

ఈ అయోధ్యను సూర్యవంశపు రాజు అయినా  దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు.
దశరథుడు  ఐశ్వర్య లో  ఇంద్ర కుబేరులకు తీసిపోనివాడు.

అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే  దశరథ మహారాజు తన ఇంద్రియాలను జయించినవాడు . అతనికి జితేంద్రడు   అని పేరు కూడా ఉంది .
దశరథుడు ఎల్లప్పుడూ సత్యమని పలికేవాడు,అసత్యం అన్నది ఎరుగడు.

 అయోధ్య నగరంలో చెవులకు కుండలములూ లేనివాడు    పుష్పాలతో అలంకరించుకోని వాడు చూద్దామన్నా కనపడదు  
అలా కడుపునిండా భోజనం చేయని వాడు  కాని, అతిదికి పెట్టకుండా తినేవాడు కానీ,దానధర్మాలు చేయని వారు కానీ, ఇంద్రియ నిగ్రహం లేనివారు కానీ అయోధ్యలో లెేరు.

అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు.పరాయి స్త్రీలను కన్నెత్తికూడా చూసేవారు కారు  .
దశరథ మహారాజుకు సమృద్దులు అయినా అమాత్యులు ఉండేవారు. (అమాత్యులు అంటే మంత్రులండి).వారు గుణవంతులు మంచి లోకజ్ఞానం నేర్పు కలవారు.వారి అమాత్యులు ఎవరు అంటే  దృష్టి, జయంతుడు,విజయుడు, సిద్ధార్దుడు, అర్ధసాధకుడు,అశోకుడు ,మంత్రపాలుడు,  సుమంతుడు వీరేనండి ఆ ఎనిమిది మంది మంత్రులు.

ఆయన కుల గురువు పేరు వశిష్ఠ మహర్షి. 
వశిష్టుడు,వామదేవుడు ఆయన పురోహితులు.
దశరథుడికి ఏ లోటూ లేదు కానీ సంతానం లేని లోటు ఆయనను చాలా బాధించేది. ఒకరోజు ఆయన ఆలోచించి అశ్వమేధ యాగం చేసి దేవతలను మెప్పించి  సంతానం పొందాలని ఆలోచించాడు.

 దానికోసం తన మంత్రుల్లో అగ్రగణ్యులైన సుమంతుడి ద్వారా వశిష్ట వామదేవ పురోహితులను,అలాగే సుయజ్ఞుడు బాబా అలియాను గురువులను, ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులనూ పిలిపించి వారి సలహా అడిగాడు.వారు అంతా ఆలోచించి అశ్వమేధయాగం ఆలోచనను మెచ్చుకున్నారు.

వారందరూ వెళ్ళినాక  దశరథ మహారాజు తో సుమంతుడు మహారాజా మీరు తలపెట్టిన అశ్వమేధ యాగాన్ని జరిపించటానికి ఋష్యశృంగుడుని మించిన వారు లేరు. అతని వృత్తాంతం చెబుతాను  మీరే వినండి అంటూ ఆయన కథ చెప్పారు.

అంగ దేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరధ మహారాజు మిత్రులలో ఒకరు రోమపాదుడు.

అన్యాయంగా పరిపాలించడం వలన అంగదేశంలో  భయంకరమైన కరువు వచ్చింది.

రోమపాదుడు ఈ కరువు చూసి దిగులుచెంది బ్రాహ్మణులను పిలిపించే కరువు పోయే మార్గాన్ని చెప్పమన్నారు.

దానితో ఆ బ్రాహ్మణులు  మహారాజా విభుండక మునికి ఋష్యశృంగుడు అనే కుమారుడు ఉన్నాడు.

 అతను ఉన్నచోట కరువు ఉండదు. ఎలాగైనా అతడిని అంగదేశానికి రప్పించి మరీ సకల మర్యాదలు చేసి మీ కూతురు అయినా శాంతను ఇచ్చి పెళ్లి చేసి అంగదేశంలోనే ఉంచుకున్నట్లయితే  కరువు కాటకాలు పోయి క్షేమంగా ఉంటుందని బ్రాహ్మణులు చెప్పారు.

అప్పుడు  రోమపాద మహారాజు పురోహితులను, మంత్రులను పిలిచి మీరు వెళ్లి ఋష్యశృంగుడు మహామునిని ఇక్కడికి తీసుకురండి అని ఆ దేశం ఇచ్చారు.

ఆ మాట విని  పురోహితులు మంత్రులు భయపడ్డారు ఎందుకనగా ఋష్యశృంగుడు సాధారణంగా అడవుల  తన తపస్సును మానేసి ఎవరో పిలవగానే వచ్చే మనిషికాదు.కోపముతో  శపించిన శపిస్తారు. 

అతనిని ఇక్కడికి రప్పించాలంటే ఏదైనా ఒక  మాయతో కూడిన ఉపాయాన్ని ఆలోచించాలి.

ఆ ఉపాయము ఏమిటో తరువాత భాగం లో తెలుసుకుందాం  








    ←Prev                                                                                                                     →Next

        
 


Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు