ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

అయోధ్యని పరిపాలించిన రాజులు ఎవరు ?

 అయోధ్యని పరిపాలించిన రాజులు 

మనకి సాధారణముగా తెలుసు కదా !

రాముని వంశాన్ని రఘువంశం అని అంటారు. రఘు వంశాన్ని సూర్య వంశం, ఇష్వాకు వంశం అని కూడా అంటారు. 

రఘు వంశానికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం 

సూర్యుని కొడుకు వివస్వంతుడు 

వివస్వంతుడి తరువాత వైవస్వత మనువు అయోధ్యా నగరాన్ని పరిపాలించారు. 

వైవస్వత మనువు కుమారుడు ఇష్వాకుడు . ఇష్వాకుడు పరిపాలించిన కాలం నుంచి రఘు వంశాన్ని ఇష్వాకు వామాసం అని కూడా అంటారు. 

ఇష్వాకుడి కి నూరుగురు పుత్రులు. వారిలో ఒకరు వికుక్షి. 

వికుక్షి కి వశిష్ట మహర్షి అనుగ్రహము వలన రాజ్యాధికారం లభించింది. 

వికుక్షి తన కుమారులలో ఒకరైన అయోధునికి రాజ్యాభిషేకం చేస్తాడు. 

అయోధనుడు తన కుమారులలో ఒకరైన కకుస్తుడికి రాజ్యాభిషేకం చేస్తాడు. 

కకుస్తుడు తన కుమారులలో జేష్ఠుడైన కువలాశ్వునికి రాజ్యాభిషేకం చేసారు. 

కువలాశ్వుడు తన కుమారులలో ఒకరైన దృడాశ్వునికి,

దృడాశ్వుడు తన పుత్రులలో ఒకరైన హర్యశ్వునికి రాజ్యాభిషేకం చేస్తారు. 

హర్యశ్వుడు తన మనుమడైనా సంహతాశ్వునికి  రాజ్యాభిషేకం చేస్తారు.

సంహతాశ్వునికి 2 పుత్రులు ,1 కూతురు 

కూతురు పేరు హైమావతి 

హైమావతికి ప్రసేనజిత్తుడు అనే కొడుకు ఉన్నాడు , తరువాత కాలములో ప్రసేనజిత్తుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు . 

ప్రసేనజిత్తుడు తన మనుమడైనా మాంధాత కి రాజ్యాభిషేకం చేస్తారు.

మాంధాత తన కుమారులలో ఒకరైన పురుకుత్సుడు కి రాజ్యాభిషేకం చేస్తారు.

పురుకుత్సుడు తన కుమారులలో ఒకరైనా త్రయ్యారునికి రాజ్యాభిషేకం చేస్తారు.

త్రయ్యారుణి కుమారుడు సత్యవ్రతుడు , తరువాత కాలంలో సత్యవ్రతుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. 

సత్యవ్రతుడు పరాక్రమవంతుడే  కానీ తండ్రి మాటను పాటింపక జీవులను హింసించడం, గోవధ చేయటం మరియు గోమాంసంము తినడం వలన సలిపి త్రిశంకుడు అను పేరు కలిగి వసిష్ఠ మహర్షి ద్వారా శాపము పొందుతాడు. 

విశ్వామిత్రుడు తన తపోబలము వలన త్రిశంకుడు కోసం స్వర్గాన్ని సృష్టిస్తాడు, అదే త్రిశంకు స్వర్గం. 

త్రిశంకుడనే సత్యవ్రతుడు పుత్రుడే హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు జీవిత పర్యంతం సత్యవ్రత దీక్షను పాటించి, శివానుగ్రహం పొంది సత్యహరిశ్చంద్రుడు అనే పేరుతో కీర్తిని పొందుతాడు. 

హరిశ్చంద్రుడి కుమారుడే లోహితుడు, లోహితుని కుమారుడే బాహువు 

ఆ తరువాతి కాలంలో బాహువు కుమారుడైన సగరుడు రాజ్యాధికారం చేస్తాడు. 

ఇతడు సామ్రాజ్యాధికారియై లోకమునా మరలా ధర్మమూ నెలకొల్పి సగర చక్రవర్తిగా కీర్తి పొందుతాడు. 

సగరునికి ఇద్దరు భార్యలు. మొదటిభార్యకి 60,000 కుమారులు జన్మిస్తారు ,రెండవ భార్యకి ఒక కుమారుడు జన్మిస్తాడు. 

వీరిద్దరకి ఔర్య మహాముని కృప వలన పుత్రసంతానం కలుగుతుంది. 

సగరుడు అశ్వమేధ యాగం సంకల్పించి, యాగాశ్వము వెంట తన 60,000 కుమారులను పంపుతాడు. 

వారు యాగాశ్వమును వెతుకుతూ పాతాళలోకమును చేరి కపిలముని కోపానికి భస్మము అవుతారు. 

వారు పాతాళ లోకమును భూమిని తవ్వినందున సముద్రం ఏర్పడి సగరుని పేరిట సాగరముగా ప్రసిద్ధి చెందినది. 

తరువాత కాలంలో అంశుమంతుడు రాజ్యాధికారం చేస్తాడు. 

అంశుమంతుడి తరువాత దిలీపుడు రాజ్యాధికారం చేస్తాడు. 

దిలీపుని కుమారుడే భగీరథుడు, భగీరథుడు పితృదేవతలకు సద్గ్రతులు ప్రసాదించుట కొరకు ఘోరతపస్సు చేసి గంగాదేవిని శివుని సహాయముతో భూమికి తెప్పించెను. 

భగీరథుని ముని మనుమడు అంబరీషుడూ, అంబరీషుని తరువాత అతని మునిమనమడైనా రఘువు రాజ్యపాలన చేస్తాడు. 

ఆ తరువాత నుంచి రఘువంశం అనే పేరు వచ్చింది. 

రఘువు కుమారుడు అజ మహారాజు. 

అజమహారాజు కుమారుడు దశరథమహారాజు 

దశరథమహారాజు కుమారుడు శ్రీరాముడు 

శ్రీరాముని కుమారులు లవకుశలు 


గమనిక:

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే సగరుడు షట్చక్రవర్తులలో ఒకడు 

షట్చక్రవర్తులు ఎవరంటే హరిశ్చంద్రుడు ,నలుడు , పురుకుత్సుడు , పురురావుడు ,సగరుడు ,కార్తవీరుడు . 

షట్చక్రవర్తులు అని ఎందుకు అన్నారంటే వీళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడుతూ భారతదేశాన్ని ప్రతిషాత్మకంగా పాలించినట్లు కీర్తించబడ్డారు. 

వర్ణాశ్రమ ధర్మమూ ఏమిటంటే వర్ణ వ్యవస్థని కాపాడటం 

మనకు అప్పుడు బ్రాహ్మణా ,క్షత్రియ ,వైశ్య మరియు క్షుద్ర అనే వర్ణాలు ఉన్నాయి , వాటిని కాపాడుతూ ధర్మాన్ని నిలపెట్టారు 





←Prev                                                                                                                                                                                                                                                                              Next→





Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు