ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

వాల్మీకి మహర్షికి రామాయణం వ్రాసే అవకాశం ఎలా వచ్చింది ?

 చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ! రామాయణం ను వాల్మీకి మహర్షి రచించారు. 
అసలు వాల్మీకి మహర్షికి రామాయణం వ్రాసే అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం !
నారద మహాముని ఒకరోజు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చి రాముని కథను వివరముగా చెప్పారు .
దాని తరువాత వాల్మీకి మహాముని తన శిష్యుడైనా భరద్వాజుడిని వెంట తీసుకుని తమసా నది తీరానికి వెళ్లారు, 
అక్కడ ఆయనకు క్రౌంచ పక్షుల జంట కనిపించింది (క్రౌంచ పక్షులు అంటే ఏమిటో అనుకోకండి అవి కొంగలండి ).
ఆ పక్షులు చాలా ఆనందముగా ప్రేమలో మునిగిపోయి పాటలు పాడుతూ , గెంటుతూ కనిపించాయి .
సాదారణముగా మనము జంట పక్షులను చుస్తే ఆనందిస్తాము కదా !
అలాగే వాల్మీకి మహర్షి కూడా ఆనందించారు. 
ఇంతలో ఒక బోయవాడు ఒక బాణం తీసుకుని మగపక్షి ని కొట్టాడు.
అది కొట్టుకుంటూ కిందపడి చనిపోయింది, ఆడపక్షి ఆర్తనాదాలు చేస్తుంది. 
అప్పుడు వాల్మీకి మహర్షికి పక్షి పైన జాలి అలాగే క్రూరుడైన బోయవాడిపై కోపం వచ్చాయి, 
ఆ సమయంలో వాల్మీకి మహర్షికి తెలియకుండానే మొట్టమొదటిసారిగా తన నోటి నుండి ఒక శ్లోకం వెలువడింది.
ఆ శ్లోకం అర్ధం ఏమి అనగా !ఓరి కిరాతకుడా !ఆనందంలో ఉన్నా క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని చంపిన నువ్వు ఎక్కువకాలం సంతోషముగా ఉండవు .
తన నోటి నుండి శ్లోకం రావడం చూసి వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోయారు😮
అది విన్న వాల్మీకి మహర్షి శిష్యుడైనా భరద్వాజుని ఆనందానికి అంతే లేదు 
భరద్వాజుడు ఆ శ్లోకాన్ని పదే పదే పఠించి కంఠస్తం చేసారు. 
తరువాత వాల్మీకి మహర్షి తమసా నదిలో స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వెళ్లారు 
అక్కడకి ఆయనను చూడటానికి బ్రహ్మదేవుడు వచ్చారు 
వాల్మీకి మహర్షి వెంటనే లేచి బ్రహ్మదేవునికి నమస్కారం చేసి ఆతిథ్యం ఇచ్చి సోత్రాలతో ప్రార్ధించారు 
అంతలో బ్రహ్మదేవుడు వాల్మీకిని కూర్చోమని మహర్షితో ఇలా అన్నారు 
నా అనుగ్రహం వల్లనే నీకు కవిత్వము వచ్చింది 
నీవు ఇంతకుముందు శ్రీరాముని కథను విన్నావు కదా !
దానిని మహాకావ్యముగా రచించు.
అది భూమి ఉన్నంతకాలము ఉంటుంది అని చెప్పి అదృశ్యం అయ్యారు 
అలా బ్రహ్మ యొక్క అనుగ్రహం వలన వాల్మీకి మహర్షికి రామాయణం రచించే అవకాశం వచ్చింది


                                                

                                                                                                                                                                                                                                        Next→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు