ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

తెలుగు సామెతలు



  తెలుగు సామెతలు 

మానవసేవే మాధవసేవ 
బూడిదలో పోసిన పన్నీరు 
అడగనిదే అమ్మ అయినా పెట్టదు
దూరపు కొండలు నునుపు 
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా 
ఊరంతా ఒక దారి ఉలిపిరి కట్టేది మరొక దారి  
ఇంటికి జేష్ఠా దేవి పొరుగింటికి లక్ష్మీదేవి 
ఆలస్యము అమృతం విషం 
అతి వినయం ధూర్త లక్షణం 
అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు 
చచ్చిన వాడి కన్నులు చారడేసి 
చంకన బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు 
చింత చచ్చినా పులుపు చావదు 
చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు 
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు 
చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు 
తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము 
తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు 
తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు 
తీగలాగితే డొంక అంతా కదిలినట్లు 
దిన దిన గండం నూరేళ్లాయుష్షు 
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు 
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు 
దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు 
నారు పోసిన వాడు నీరు పోయాడా 
నిండుకుండ తొణకదు 
నిప్పు లేనిదే పొగ రాదు 
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది 
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం 
పిట్ట కొంచెం కూత ఘనం 
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు 
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది 
పెరటి చెట్టు మందుకు పనికిరాదు 
పెద్దల మాట చద్దిమూట 
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా 
ముంజేతి కంకణానికి అద్దమేల 
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు 
సూర్యుని ముందు దివిటీ పట్టినట్లు 
మొక్కై వ్రంగనిది మానై వంగునా 
అడుసు ద్రొక్కనేల కాలు కడగనేల 
తాతకి దగ్గు నేర్పినట్లు 
పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ 
రాజుల సొమ్ము రాళ్ళ పాలు 
విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందా 
నేల విడిచిన సాము తాళం విడిచిన పాట 
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె 
లేడికి లేచిందే పరుగు 
అందని ద్రాక్ష పండ్లు పుల్లన 
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు 
అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు 
ఆంజనేయుని ముందు కుప్పిగంతులా 
ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు 
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు 
చల్లకు వచ్చి ముంత దాచినట్లు 
గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు 
గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తముడుకున్నట్టు 
గుడ్డెద్దు చేలో పడినట్లు 
ఎద్దు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్లు 
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారమన్నట్లు 
కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం 
తమ్ముడు తనవాడైన ధర్మం సరిగ్గా చెప్పాలి 
పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు 
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 
కోటి విద్యలు కోటి కూటి కొరకే 
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్లు 
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచినట్లు 
కుక్క కాటుకి చెప్పు దెబ్బ 
కుక్క తోక వంకర 
కాకి పిల్ల కాకికి ముద్దు 
కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఆరు నెలలు బ్రతికితే చాలు 
కర్ర విరగదు పాము చావదు 
కందకు లేని దురద కత్తిపీటకెందుకు 
ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయి 
ఏరు  దాటి తెప్ప తగలబెట్టినట్లు  
ఏనుగు చచ్చినా వెయ్యే బ్రతికిన వెయ్యే 
ఏ ఎండకా గొడుగు పట్టు 
ఎవరికి వారే యమునా తీరే 
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే 
ఎంత చెట్టుకు అంత గాలి 
ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి 
ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్లు 
ఇంటిపేరు కస్తూరి ఇంట్లో గబ్బిలాల కంపు 









                                                                                                                                                                     Next→

                                                                                                                    

 

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు