ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

కౌసల్యా దుఃఖం… రాముని నిర్ణయం || Koushlya Dukham....Ramuni Nirnayam || Ramayanam || Epsode 55

 

 రాముడు తల్లికి, లక్ష్మణునకు నచ్చచెప్పడం

అప్పుడు లక్ష్మణుడు అమ్మా! కౌసల్యా! అన్నా రామా! దశరథమహారాజు వృద్దుడైపోయినా ఇంకా యౌవనంలోనే ఉన్నానను కొంటున్నాడు. అందువల్ల ఆయనలో భోగాసక్తి తగ్గలేదు. కామంచేత ఒక ఆడదాని మాటలకు బానిసై విపరీతపు నిర్ణయాలు తీసుకున్నాడు. అంతమాత్రం చేత రాముడు ఒక ఆడదానికిచ్చిన మాటకోసం రాజ్యలక్ష్మిని వదులుకోవటం నాకు బొత్తిగా ఇష్టంలేదు. ఆ మాటకు వస్తే రాముడు ఏం తప్పుచేశాడని దేశాన్నుంచి బహిష్కృతుడవుతున్నాడు. అరణ్యాలకు పంపాల్సినంత దోషం అతడు ఏమి చేశాడు? ఎంతటి శత్రువైనా రాముణ్ణి గూర్చి ఒక్క మాట. కూడా వ్యతిరేకంగా మాట్లాడలేడు.






















రాముడు దేవతలలో పరిగణించదగ్గవాడు. ధర్మబుద్ధి గలవాడు, ఇంద్రియనిగ్రహం కలవాడు, కపటం లేనివాడు. శత్రువులకు కూడా మేలు చేసే స్వభావం గల రాముణ్ణి ఎందుకొరకు అడవులకు పంపాలి? ఏ తండ్రి అయినా అటువంటి వాడికి ఇలాంటి ఏకపక్షమైన శిక్షను విధిస్తాడా?

రామా! ఈ విషయం నలుగురికీ తెలియకమునుపే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుందాం. ధనుస్సును ధరించి, నేను నీ ప్రక్కన ఉంటే నిన్ను ఎదిరించే ధైర్యం ఎవరికుందో చూద్దాం. నా వాడిబాణాల ధాటికి ఈ అయోధ్యా నగరమే నిర్మానుష్యమైపోతుంది. భరతుని పక్షాన ఎవరొచ్చినా, ఎందరొచ్చినా వాళ్ళందరినీ నాశనం చేస్తాను. ఒకవేళ దశరథ మహారాజే కైకేయిని వెనకేసుకువస్తే ఆయన్నూ బంధిస్తాను. తప్పనిసరైతే చంపుతాను. గురువైనా అధర్మమార్గాన్ని అనుసరిస్తే అతణ్ణి శిక్షించాల్సిందే.

రామా! కామంతో కళ్ళు మూసుకుపోయిన వారు తండ్రే అయినా దండించాల్సిందే. ఇది రాజధర్మమే కదా! నీకు ధర్మబద్ధంగా రావలసిన రాజ్యాన్ని దశరథ మహారాజు కైకేయికి ఏ కారణంచూపి కట్టబెడదామని అనుకున్నాడు? ఆ విషయంలో ధర్మం ఆయన పక్షాన లేదు.
శౌర్యపరంగా, ఆయన సైన్యమంతా ఏకమై వచ్చినా మనిద్దరినీ జయించలేడు.

అమ్మా! ఓ కౌసల్యాదేవీ! నేను త్రికరణశుద్ధిగా రాముని అనుచరుణ్ణి. ఈ మాట నా ధనుస్సు మీదా, నేను చేసుకున్న పుణ్యం మీద, ధర్మం మీద ఒట్టువేసి చెబుతున్నాను. అమ్మా! రాముడి కోసం మండే మంటల్లోనైనా దూకుతాను. రాముడి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే. రాముడు అడవులకు వెళ్ళేందుకు నిర్ణయించుకుంటే నేనూ అడవులకుపోతాను. అమ్మా! నీ దుఃఖాన్ని చూడలేకుండా ఉన్నాను. నా పరాక్రమంతో నీ దుఃఖాన్ని, సూర్యరశ్మి చీకటిని అంతంచేసినట్లు, అంతం చేస్తాను అని కౌసల్యాదేవితో మరియు రాముడితో అంటాడు.

అప్పుడు కౌసల్య రాముడితో  రామా! లక్ష్మణుని మాటలు విన్నావు కదా! ఏం చెయ్యాలో నీవే నిర్ణయించుకో. మహారాజు నా సవతి మెప్పుకోసం, నన్ను దుఃఖంలో ముంచి నిన్ను అడవులకు పంపుతున్నాడు. నన్ను ఒంటరిదాన్ని చేసి పితృవాక్య పరిపాలన అంటూ అడవులకు పోవద్దు. నువ్వు ధర్మాలన్నీ తెలిసినవాడవు. ఈ వృద్ధాప్యంలో నాకు సేవలు చేయడం కూడా పరమధర్మమే అని తెలుసుకో కుమారా! పూర్వం కాశ్యపుడు ఇంట్లో ఉంటూనే మాతృసేవలు చేస్తూ స్వర్గాన్ని పొందాడు. గురువుగా తండ్రి నీకెట్లా పూజ్యుడో అట్లాగే తల్లిగా నేనుకూడా పూజ్యురాలినే. కాబట్టి నేను నీకు అనుమతి ఇవ్వటం లేదు. నువ్వు లేనిచోట ఎన్ని సుఖాలున్న నన్ను సంతోషపెట్ట లేవు. కాబట్టి నీతోపాటే వస్తాను. అక్కడ నీతో గడ్డి తిని బ్రతకమన్నా సంతోషంగా తింటాను. నా మాట కాదని అడవులకు వెళ్తే నేను ఆమరణ నిరాహారదీక్ష చేపడతాను.

రామా! పిప్పలాదమహర్షి విషయంలో సముద్రుడు అధర్మంగా ప్రవర్తించటం మూలంగా, సముద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అట్లానే నీ మూలంగా నేను మరణిస్తే నీకు గూడా ఘోరమైన దుర్గతి పడుతుంది అని అంటుంది.

అప్పుడు రాముడు అమ్మా! తండ్రి ఆజ్ఞను నేను తప్పక పాటించాలి. ఆయన ఆజ్ఞను అతిక్రమించే శక్తి నాకు లేదు. కండుమహర్షి సర్వధర్మాలు, సర్వశాస్త్రాలు తెలిసినవాడు. అనేక వ్రతాలు ఆచరించినవాడు. తండ్రి చెప్పినందువలన గోవును చంపాడు. మన వంశంలోనే జన్మించిన సగరుని కుమారులందరూ తండ్రి ఆజ్ఞలను శిరసావహించి భూమిని త్రవ్వి భయం కరమైన మరణాన్ని పొందారు, జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి చెప్పాడని తన గండ్రగొడ్డలితో తల్లి రేణుకాదేవి తలను నరికాడు. వీరే కాదు. ఇంకా ఎంతోమంది మహాత్ములు తండ్రి ఆజ్ఞను శిరసావహించారు. అట్లాగే నేను కూడా తండ్రిగారి ఇష్టానికి వ్యతిరేకంగా నడచుకోలేను. అమ్మా! పితృవాక్యాన్ని పరిపాలించడం అనే ధర్మం నాతోనే మొదలు కాలేదు. ఇంతకు పూర్వం ఎంతోమంది అనుసరించారు. అట్లాగే ఇది ముందు తరాలవాళ్ళు కూడా ఆచరించాల్సిన ధర్మం. తండ్రి ఆజ్ఞ పరిపాలించిన వారికి ఏ విధమైన దోషమూ అంటదు.

సోదరా! లక్ష్మణా! నీకు నా పట్ల ఉండే ప్రేమాభిమానాలను నేనెరుగుదును. నీ బలపరాక్రమాలు కూడా నాకు బాగాతెలుసు. మన తల్లి కౌసల్యాదేవి మహాదుఃఖంలో మునిగి ఉంది. అందువలన సత్యము, ధర్మము, శాంతిని గూర్చి చక్కగా తెలియకపోవటం వలన ఇట్లా మాట్లాడుతోంది.

లక్ష్మణా! సకల పురుషార్ధాలకూ ధర్మమే మూలం. ధర్మానికి సత్యమే మూలం. సత్యం లేకుండా ధర్మం నిలవదు. ధర్మం లేకుండా సత్యం నిలవదు. ఆ రెండింటికీ అటువంటి అవినాభావ సంబంధం ఉంది. తండ్రికిగాని, తల్లికిగాని, బ్రాహ్మణునికిగాని మాట ఇచ్చిన తర్వాత ధర్మాన్ని అనుసరించేవాడు ఎవడూ మాట తప్పుడు; తప్పకూడదు. అందువల్లనే నేను తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తున్నాను. నాతో చెప్పింది కైకేయీదేవియే అయినా నా తండ్రి మాటనే, ఆమె తెలియ చెప్పింది. అందువలన ఇది క్షత్రియధర్మాన్ని ఆచరించాల్సిన సమయం కాదు. ఎవరిపైనా క్రోధాన్ని పెంచుకోవద్దు.

అమ్మా! కౌసల్యాదేవీ! నేను అరణ్యానికి పోక తప్పదు. నా వనవాసానికి నువ్వు అడ్డుచెప్పవద్దు. నన్ను ఆశీర్వదించి పంపు. నీ దీవెనలుంటే, యయాతి మహారాజులాగా స్వర్గాన్నుండి భూమిపైకి వచ్చి మరల భూమిపైనుండి స్వర్గానికి వెళ్ళినట్లుగా, నేనుకూడా అరణ్యాలకు వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలైన తరువాత మళ్ళీ అయోధ్యకు వస్తాను. అమ్మా! రాజాజ్ఞ నా ఒక్కడికే కాదు. నువ్వు, సుమిత్రాదేవి, సీత, లక్ష్మణుడు కూడా పాటించాలి. ఇదే సనాతన ధర్మం.

అమ్మా! రాజ్యాభిషేకానికై సమకూర్చిన సంబారాలన్నీ భరతుని రాజ్యాభిషేకానికి ఉపయోగించండి. నేను వనవాసానికి వెళ్ళక తప్పదు. కాబట్టి నువ్వుకూడా సమ్మతించి నన్ను ఆశీర్వదించి పంపు. అమ్మా! దుఃఖించవద్దు.

రాముడు ఈ విధంగా తల్లికీ, లక్ష్మణునికీ ధైర్యం చెప్పి, పితృవాక్పరిపాలన విషయంలో తన దృఢనిశ్చయాన్ని తెలిపాడు. ఈ మాటలన్నీ వింటూ కౌసల్యాదేవి మూర్చపోయింది. రామలక్ష్మణులిద్దరూ ఆమెకు ఉపచారాలు చేశారు. కొంతసేపటికి ఆమె తేరుకుని ఇట్లా అంది.

అప్పుడు కౌసల్య: పుత్రా! నిన్ను పెంచి పోషించడంలోను, స్వధర్మం చేతా నీకు తండ్రి ఎట్లా గురువో, నేనూ అట్లాగే గురువునవుతాను. తండ్రి ఎంత పూజ్యుడో, తల్లీ అంతే పూజ్యురాలవుతుంది. ఈ వయస్సులో సువ్వు నా దగ్గర లేకపోతే, ఇక నేను బ్రతికి ఉండడం. వ్యర్థమే. మరణించిన తర్వాత నీ వలన కలిగే స్వర్గం, అమృతపానం, పితృలోకంలో లభించే స్వధలు తినడం, మహర్లోకంలో ఆనందాన్ని పొందడంవంటి వాటిపై నాకు ఆసక్తి లేదు. నేను జీవించి ఉన్నంత కాలం, నువ్వు నా ఎదుట ఉండాలన్నదే నా కోరిక. అది తీరని పక్షంలో నేను ఎందుకు జీవించాలి?

అట్లా అంటూనే కౌసల్యాదేవి మళ్ళీ మూర్చపోయింది. మరోపక్క తమ్ముడు లక్ష్మణుడు దుః ఖావేశంలో ఉన్నాడు. ఎవరెన్ని చెప్పినా రాముడిలోని ధర్మచింతన మారలేదు. స్థిరంగా ధర్మంపైనే నిలబడి ఉన్నాడు.

అప్పుడు రాముడు: తమ్ముడా! లక్ష్మణా! నీకు నా పట్ల ఉన్న భక్తిని, నీ పరాక్రమాన్ని నే నెరుగుదును. కానీ నువ్వు నన్ను అర్ధం చేసుకోకుండా అమ్మతో చేరి నన్ను ఇబ్బంది. పెడుతున్నావు.

ఒక్క ధర్మం వల్లనే ధర్మార్థకామాలనే మూడు పురుషార్ధాలు లభిస్తాయి. అది ఎట్లాగంటే, ఒక్క భార్యలోనే అనుకూలత, ప్రేమపాత్రురాలుగా ఉండటం, సుపుత్రులను ఇవ్వడం వంటి మూడు గుణాలున్నాయో, అట్లాగే ధర్మం ధర్మార్ధ కామ ఫలాలు మూడింటినీ ఇస్తుంది. కాబట్టి మానవుడు ధర్మార్థకామాలు మూడూ ఇచ్చే ధర్మాన్నే ఆచరించాలి. కానీ అర్థాన్ని మాత్రమే ఇచ్చే ధర్మాన్ని ఆచరించ కూడదు. అట్లా కాకుండా ఒక్క అర్థాన్ని మాత్రమే ఇచ్చే ధర్మాన్ని ఆచరిస్తే లోకంలో ద్వేషం పెరిగిపోతుంది. అట్లాగే కామాన్ని మాత్రమే సాధించే ధర్మం కూడా మెచ్చుకోదగ్గది కాదు.

పూజ్యుడు, వృద్ధుడు, రాజు, అంతేగాక తండ్రి అయినవాడు కోపంతో గాని, సంతోషంతో గాని, కామం వలన గాని ఒక పనిచేయమని ఆదేశించినప్పుడు ధర్మదృష్టి కలిగిన వాడు ఆ పనిని తప్పక చేయాలి. అట్లా చేయనని అనడం క్రూర ప్రవృత్తే అవుతుంది.

కాబట్టి సోదరా! నీకు, నాకు కూడా మన తండ్రే గురువు. ఆయన ఆజ్ఞాపించినట్లు చేయడమే మన ధర్మం. ఇక అమ్మ కూడా ఆయనకు ధర్మపత్ని. ఆమెకు కూడా ఆయనే దిక్కు. ఆయన ఆజ్ఞను శిరసావహించడమే ఈమెకు పరమధర్మం. మన తండ్రికి, తన పూర్వీకులకన్నా ధర్మాత్ముడన్న పేరు ఉంది. అటువంటి ధర్మాత్ముడు జీవించి ఉండగా ఆయనను వదలి (విధవలాగా) కొడుకు వెంట అడవులకు వెళ్ళడం ధర్మసమ్మతం కాదు.

అమ్మా! ఓ పట్టపురాణీ! నేను వనవాసానికి పోతున్నాను. కేవలం ధర్మాచరణ వలననే యయాతి మహారాజు తిరిగి స్వర్గానికి వెళ్ళినట్లు, పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పూర్తిచేసుకొని తిరిగి అయోధ్యకు రమ్మని నన్ను ఆశీర్వదించు. అమ్మా! కేవలం రాజ్యంకోసం గొప్ప కీర్తిని, సత్ఫలితాలను ఇచ్చే ధర్మాన్ని విడిచి పెట్టలేను, ధర్మాచరణ ముందు రాజ్యాన్ని తుచ్ఛమైనదిగా పరిగణిస్తాను. 

ఆ విధంగా పురుషోత్తముడైన రాముడు తల్లికి, లక్ష్మణుడికి ధైర్య వచనాలు చెప్పి తల్లికి ప్రదక్షిణ నమస్కారం చేసి బయటకు వెళ్లాడు.




                                                                                                                                          ← PREV || NEXT →

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు