ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Viswamithrudu - Menaka Ela Kalisaru? || Ramayanam


విశ్వామిత్రుడు - మేనక పరిచయం  

కోపంతో తన కొడుకులను శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్లీ తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా పుష్కర క్షేత్రములో వేయి సంవత్సరాలు తపస్సు చేశాక అతని తపస్సును మెచ్చుకొన్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు. 

విశ్వామిత్రుని చూచి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు : " ఓ విశ్వామిత్రా! నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు" అని చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్లిపోయాడు . 

కానీ విశ్వామిత్రుడికి తృప్తి కలగలేదు. తాను కూడా వశిష్ఠ మహర్షిలాగా బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరల తపస్సు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. 

అలా ఒకరోజు  మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూసి తన అందచందాలకు మోహితుడైనాడు. 

మేనక దగ్గరకు వెళ్లి " ఓ అప్సరస! నీకు నా ఆశ్రమానికి స్వాగతం. నిన్ను చూసి నేను పరవశుడను అయ్యాను. మన్మధ బాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు" అని వేడుకున్నాడు. 
విశ్వామిత్రుని కోరికను మన్నించి మేనక అతని ఆశ్రమంలోనే ఉండిపోయింది. అలా 10 సంవత్సరాలు సుఖంగా కాలం గడిపారు. 

10 సంవత్సరాలు తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు. తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారేమో అని కూడా అనుమానం వచ్చింది. మేనక వంక చూసాడు. ఆమె భయముతో గడ గడా వణికిపోయింది. ఆమె మీద జాలిపడ్డాడు. విశ్వామిత్రుడు ఆమెతో ప్రేమగా మాట్లాడి మేనకను పంపించి వేసాడు. ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకు వెళ్లి తపస్సు చేయడం ప్రారంభించాడు. 




                                                                                                                                    <---Prev || Next --->

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు